ఎన్నికల కమిషనర్ లేఖ: టీడీపీపై యాక్షన్‌కు సిద్ధమైన వైసీపీ

Share Icons:

అమరావతి: ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పేరుతో హఠాత్తుగా తెర పైకి వచ్చిన లేఖ.. వైరల్ గా మారింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ కేంద్ర హోంశాఖకు రాసినట్లుగా చంద్రబాబు స్క్రిప్టు ప్రకారం లేఖ సిద్దం చేసారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని డామేజ్ చేసే కుట్రలో భాగంగా విమర్శించారు. రమేష్ కుమార లెటర్ హెడ్ మీద బయటకు వచ్చిన ఈ లేఖ టీవీ ఛానళ్లలో.. సోషల్ మీడియాలో వైరల్ అయింది. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా హింసాత్మక సంఘటనలు ఎక్కువగా జరిగాయని ఆ లేఖలో ఉంది.

ఎన్నికల్లో అక్రమాలు, డబ్బు, మద్యం ప్రభావాన్ని పూర్తిగా అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ ఉద్దేశాలను లేఖలో తప్పుబట్టారు. తనకు, తన కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖను రమేశ్‌ కుమార్‌ కోరినట్లు లేఖలో ఉంది. దీంతో..వైసీపీ అసలు ఏం జరిగిందనే అంశం పైన నిఘా వర్గాల నుండి సమాచారం సేకరించింది. ఇదే ససమయంలో ఎన్నికల కమిషనర్ తాను లేఖ రాయలేదని స్పష్టం చేసారు. దీంతో..ఇది టీడీపీ పనే అంటూ వైసీపీ రాజకీయ దాడి మొదలు పెట్టింది.

ఇక, ఈ వ్యవహారం పైన రాజకీయంగా దుమారం చెలరేగటంతో..పొద్దు పోయిన తరువాత ఏఎన్ఐకి రమేష్ కుమార్ స్పష్టత ఇచ్చారు. తాను ఎటువంటి లేఖ రాయలేదని స్పస్టం చేసారు. దీంతో..ఇప్పుడు ప్రభుత్వం ఈ వ్యవహారానని సీరియస్ గా తీసుకుది. వెంటనే డీజీపీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. మరి..తాను రాయకుండా తాను రాసినట్లుగా వైరల్ అయిన లేఖ పైనా ఇప్పుడు రమేష్ కుమార్ సైతం ఫిర్యాదు చేస్తారని తెలుస్తోంది. అయితే, తమ పైన వస్తున్న విమర్శలకు టీడీపీ ఏ రకంగా స్పందిస్తుదనేది చూడాల్సి ఉంది. ఇప్పుడు ఈ లేఖ వ్యవహారం పైన ఈ రోజు కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం ఉంది.

 

Leave a Reply