వైసీపీ పేజ్ పోల్‌లో అమరావతికి ఎక్కువ ఓట్లు….

Share Icons:

అమరావతి: రాష్ట్రంలో రాజధాని ఇష్యూ బాగా నడుస్తున్న విషయం తెలిసిందే. వైసీపీ ఫోరం ఫేస్‌బుక్ పేజ్‌లో ‘ఏపీకి రాజధానిగా ఏ నగరం ఉండాలని’ పోల్ నిర్వహించగా, అందులో… అమరావతికి 77 శాతం మంది, విశాఖపట్నానికి 23 శాతం మంది ఓట్లు వేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఆ స్క్రీన్‌షాట్‌ను టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తన ట్విట్టర్‌ ఖాతాలో  పోస్ట్ చేసి వైసీపీకి చురకలంటించారు.

‘వైసీపీ ఫోరం తమ ఫేస్‌బుక్ పేజ్‌లో ఓ పోల్‌ నిర్వహించింది. రాజధానిగా అమరావతి బాగుంటుందా? లేక విశాఖపట్నమా? అన్న విషయాలను తెలపాలని కోరింది. మొత్తం 1.13 లక్షల ఓట్లు వస్తే అమరావతికి 77 శాతం ఓట్లు, విశాఖకు 23 శాతం ఓట్లు వచ్చాయి’ అని గల్లా జయదేవ్ పేర్కొన్నారు.

అటు చంద్రబాబు హయాంలో ఫ్రాంక్లిన్ టెంపుల్ టౌన్ (ఫ్రాంక్లిన్ టెంపుల్టన్) అనే డమ్మీ కంపెనీని ఏర్పాటు చేశారంటూ లోక్ సభలో నిన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ప్రతినిధులు కూడా ఖండించారు. అనేక దేశాల్లో కార్యకలాపాలను కొనసాగిస్తున్న తమ సంస్థను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని వారు అన్నారు. మరోవైపు, మిథున్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు.

‘అది ఫ్రాంక్లిన్ టెంపుల్ టౌనో, విలేజో కాదు మాస్టారు. ఆ కంపెనీ పేరు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్. కంపెనీ పేరు కూడా తెలుసుకోకుండా ‘ఫ్రాంక్లిన్ టెంపుల్ టౌన్ చంద్రబాబుగారి బినామీ కంపెనీ’ అంటూ పార్లమెంటులో వైకాపా ఎంపీ చేసిన స్టాండ్ అప్ కామెడీ నన్ను ఫిదా చేసింది. ఫ్రాంక్లిన్ చంద్రబాబుగారి బినామీ కంపెనీ కదా… అలాంటి ఆ కంపెనీలో మీరెందుకు పెట్టుబడులు పెట్టారని జగన్ గారిని నిలదీయండి ఫ్రాంక్లిన్ టెంపుల్ టౌన్ ఎంపీ గారు.

ఒక అంతర్జాతీయ సంస్థ ఉత్తరాంధ్రకి రావడం జగన్ గారికి మొదటి నుండీ ఇష్టం లేదు. ఉత్తరాంధ్ర యువతకి మంచి కంపెనీలో ఉద్యోగాలు రావడం వైసీపీ నాయకులకు రుచించడం లేదు. ఎప్పటికీ ఉత్తరాంధ్ర వెనుకబడి ఉండాలి అనే దురుద్దేశంతో కంపెనీలు రాకుండా అడ్డుపడుతున్నారు. బినామీ కంపెనీలు అంటూ చెత్త మాటలు మాట్లాడుతున్నారు కాబట్టే కంపెనీలు జగన్ గారిని చూసి బైబై ఏపీ అంటున్నాయి’ అని లోకేశ్ ట్వీట్ చేశారు.

 

Leave a Reply