అక్కడ వైసీపీకే ఎడ్జ్ ఉందటా….

Share Icons:

ప్రకాశం, 26 ఏప్రిల్:

గత ఎన్నికల్లో టీడీపీ విజయబావుటా ఎగరవేసిన ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో…ఈసారి వైసీపీకి ఎడ్జ్ ఉందని తెలుస్తోంది. పోలింగ్‌కి ముందు జరిగిన పరిణామాలని బట్టి చూస్తుంటే ఇక్కడ  వైసీపీ విజయం ఖాయమని సమాచారం. కనిగిరి నుంచి వైసీ అభ్యర్థిగా బుర్రామధుసూదన్ యాదవ్, టీడీపీ అభ్యర్థిగా ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పోటీ చేశారు. జనసేన పార్టీ ఇక్కడ పొత్తులో భాగంగా వామపక్షాలకు కేటాయించింది.

అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబూరావును దర్శినియోజకవర్గానికి పంపి, ఆయన స్థానంలో ఉగ్రనరసింహారెడ్డికి టీడీపీ అధిష్టానం చివరి నిమిషంలో టిక్కెట్ కేటాయించింది. ముక్కు ఉగ్రనరసింహారెడ్డి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసి ఉండటంతో ఆయనను కాంగ్రెస్ నుంచి రప్పించి మరీ సీటు కేటాయించారు. కనిగిరి నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ. సుమారు 47వేల మంది రెడ్డి సామాజిక వర్గ ఓటర్లున్నారు. రెడ్డి సామాజిక వర్గం మొత్తం వైసీపీ వైపే ఉంది.

ఇక ఇది గమనించిన ఉగ్రనరసింహారెడ్డి తనను గెలిపిస్తే మీరు చెప్పిన పార్టీలోకి వెళతానని చెప్పి ప్రచారం చేశారని సమాచారం. అయితే రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ శాతం మంది పోలింగ్ రోజు వైసీపీ వైపే మొగ్గు చూపారని తెలుస్తోంది. అటు వైసీపీ అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో ఆ సామాజికవర్గం మొత్తం వైసీపీ వైపే ఉందంటున్నారు. నియోజకవర్గంలో యాదవ సామాజిక వర్గం ఓటర్లు 38 వేల వరకూ ఉన్నారు.

మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబూరావుకు సీటు దక్కకపోవడంతో ఆయన సామాజిక వర్గమైన కాపులు కూడా టీడీపీకి ఓటు వేయలేదని తెలుస్తోంది. ఏది ఏమైనా ఈసారి కనిగిరిలో వైసీపీకే ఎడ్జ్ కనపడుతుంది.

మామాట: మొత్తానికి టీడీపీ సిట్టింగ్ సీటు వైసీపీ ఖాతాలో పడేలా ఉంది….

Leave a Reply