50వేల మెజారిటీ దాటిన వైసీపే అభ్యర్ధులు వీరే…

Share Icons:

అమరావతి, 24 మే:

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్ధులు 175 అసెంబ్లీ స్థానాలకి గాను 151 స్థానాల్లో అఖండ విజయం సాధించారు.

ఇక టీడీపీ 23 స్థానాలకే పరిమితం కాగా, జనసేన 1 స్థానంలో గెలిచింది. వైసీపీ ప్రభంజనం వల్ల టీడీపీ  నాలుగు జిల్లాల్లో ఖాతా కూడా తెరవలేదు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోనే ఆరుగురు వైసీపీ అభ్యర్ధులు భారీ విజయాలని సొంతం చేసుకున్నారు.

వీరు అందరూ 50 వేల మెజారిటీని దాటేశారు. అందులో మొదటి వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ అత్యధిక ఆధిక్యాన్ని నమోదు చేశారు. పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో దిగిన జగన్‌.. తన సమీప ప్రత్యర్థి, తెదేపా అభ్యర్థి సతీశ్‌రెడ్డిపై 90,110 ఓట్ల ఆధిక్యంతో గెలుపొంది రికార్డు సృష్టించారు.

ఆ తర్వాత ప్రకాశం జిల్లాలో గిద్దలూరులో వైసీపీ అభ్యర్థి వెంకట రాంబాబు 81,035 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో కె. సంజీవయ్య(వైసీపీ) 61,292 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో వైసీపీ అభ్యర్థి సూర్యనారాయణ రెడ్డి 55,207 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. కడప అసెంబ్లీ నియోజకవర్గంలో అంజాద్‌ బాషా(వైసీపీ) 54794 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అలాగే  జమ్మలమడుగులో వైసీపీ అభ్యర్థి సుధీర్‌ రెడ్డి తన సమీప టీడీపీ అభ్యర్థి రామసుబ్బారెడ్డిపై 51,641 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.  

మామాట: ప్రజా మద్ధతు వీరికి గట్టిగా ఉంది…

Leave a Reply