బొండా ఉమా, బుద్దా వెంకన్నపై వైసీపీ కార్యకర్తల దాడి…బాబు ఫైర్…

Share Icons:

అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికార వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యర్థులపై దాడులు చేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. అలాంటి సంఘటనే మరొకటి చోటు చేసుకుంది. ఈ సారి టీడీపీ ముఖ్య నేతలు బోండా ఉమ, బుద్దా వెంకన్న కార్లను అడ్డగించిన వైసీపీ వర్గీయులు వాటిపై దాడి చేసి ధ్వంసం చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ఈ ఘటనపై పోలీసులు సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తున్నారు. దాడి చోటు చేసుకున్న ప్రదేశంలో అమర్చిన సీసీటీవీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. గుంటూరు జిల్లాలోని మాచర్ల సమీపంలో బుద్ధా వెంకన్న, బోండా ఉమామహేశ్వరరావులు వెళ్తోన్న ఓ కారును వైఎస్ఆర్సీపీ నాయకులు బైక్‌లపై వెంబడించి మరీ..పట్టపగలు దాడి చేశారు. వైసీపీ కార్యకర్తలు తమ వెంటపడ్డారని బోండా ఉమ వెల్లడించారు. నిన్న మాచర్లలో టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవడంతో.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశంతో మాచర్లకు బోండా ఉమ, బుద్దా వెంకన్న వెళ్లారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరిపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్తే ఎవరూ లేరని బోండా ఉమ వెల్లడించారు.

ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయని, ఆ ఇద్దరు నాయకులు ప్రాణాలతో బయటపడగలిగారని వెల్లడిస్తున్నారు. మాచర్ల నుంచి దుర్గి వెళ్తోన్న మార్గంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. గుంటూరు జిల్లాలోని మాచవరంలో తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థులు నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి వెళ్లగా.. అక్కడ వైసీపీ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

దాడులకు గురైన తమ పార్టీ అభ్యర్థులను పరామర్శించడానికి బుద్ధా వెంకన్న, బొండా ఉమామహేశ్వరరావు బుధవారం ఉదయం మాచవరానికి బయలుదేరి వెళ్లగా.. మార్గమధ్యలో వైసీపీ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారని, వెంబడించి మరీ కర్రలతో దాడికి పాల్పడ్డారని చంద్రబాబు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్‌ను వారు మీడియాకు విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని చంద్రబాబు ఫైర్ అయ్యారు.

 

Leave a Reply