వైసీపీ దూకుడు..కదిరి అభ్యర్ధి ప్రకటన…

Share Icons:

అనంతపురం, 21 జనవరి:

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపించనున్న వేళ ప్రతిపక్ష వైసీపీ పార్టీ దూకుడు ప్రదర్శిస్తుంది. ఇప్పటికే పలు స్థానాల్లో అభ్యర్ధులని ప్రకటిస్తూ వస్తున్న వైసీపీ…తాజాగా అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయబోయే అభ్యర్థిని ప్రకటించింది.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కదిరిలో వైసీపీ నుంచి పీవీ సిద్ధారెడ్డి పోటీ చేస్తారని జిల్లా ఇన్ చార్జి, పార్లమెంటు మాజీ సభ్యుడు మిథున్ రెడ్డి ప్రకటించారు. ఇక వైసీపీ అధినేత జగన్ ఆదేశాల మేరకే సిద్ధారెడ్డి పేరును ప్రకటిస్తున్నామన్నారు.

కాగా, 2009లో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం తరఫున పోటీ చేసిన సిద్ధారెడ్డి అప్పట్లో 18,177 ఓట్లను దక్కించుకున్నారు. అయితే 2014లో వైసీపీ తరఫున ఆయనే పోటీ చేస్తారని భావించినప్పటికీ చివరి క్షణంలో పార్టీలోకి వచ్చిన చాంద్ బాషా టికెట్‌ దక్కించుకుని గెలిచారు. కానీ చాంద్ బాషా టీడీపీలోకి ఫిరాయించిన తర్వాత కదిరి ఇన్ చార్జిగా సిద్ధారెడ్డిని జగన్ నియమించారు. ఈ క్రమంలోనే అప్పట్లో సిద్ధారెడ్డికి ఇచ్చిన మాటకు కట్టుబడి జగన్ ఇప్పుడు కదిరి స్థానాన్ని ఆయనకు కేటాయించినట్టు సమాచారం.

మామాట: ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని మరోసారి రుజువు చేసిన జగన్…

Leave a Reply