కేంద్ర కేబినెట్‌లో ఏపీ, తమిళనాడుకు ఛాన్స్..బీజేపీ వ్యూహం ఇదేనా?

pm-modi-expand-central-cabinet-once-again
Share Icons:

ఢిల్లీ: వరుసగా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతూ  వస్తున్న బీజేపీకి , తాజాగా ఢిల్లీ రూపంలో మరో షాక్ తగిలిన విషయం తెలిసిందే. దీంతో ఢిల్లీలో ఓటమిని పక్కనబెట్టేందుకు బీజేపీ అధిష్టానం కేబినెట్ విస్తరణ చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నట్లు అర్ధమవుతోంది. ఢిల్లీ ఓటమిని మరిపిస్తూ కేబినెట్ లోకి దక్షిణాది పార్టీలకు ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా దేశవ్యాప్తంగా తాము బలంగానే ఉన్నామనే సంకేతాలు ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే దక్షిణాదిన బలంగా ఉన్న వైసీపీ, డీఎంకే పార్టీలను కేబినెట్ లోకి మరోమారు ఆహ్వానించన్నట్లు సమాచారం.

కేంద్ర కేబినెట్ లో చేరేందుకు వైసీపీ అంగీకరిస్తే ఆ పార్టీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని తీసుకోవాలని భావిస్తున్నారు. ఆయనతో పాటు వైసీపీకి చెందిన మరో దళిత ఎంపీకి కూడా అవకాశం దక్కనుంది. అలాగే డీఎంకే నుంచి పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ సోదరి కనిమొళికి అవకాశం కల్పిస్తామని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. కనిమొళితో పాటు మరో డీఎంకే ఎంపీకి సహాయమంత్రి పదవిని ఆఫర్ చేస్తున్నారు. మరి బీజేపీ ఆఫర్ చేసిన వైసీపీ, డి‌ఎం‌కేలు అంగీకారం ఎంతవరకు ఉంటుందో?

ఇదిలా ఉంటే బుధవారం ఏపీకి సంబంధించి పలు కీలక అంశాలపై ప్రధాని మోదీతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్చించారు. ఏపీకి మూడు రాజధానులు, కర్నూలో హైకోర్టు ఏర్పాటు, మండలి రద్దు తీర్మానంతో పాటు ప్రత్యేక హోదా, పోలవరం వంటి అంశాలను వివరించారు. ప్రధాని నివాసంలో ఇరువురి మధ్య దాదాపు 100 నిమిషాలసేపు సమావేశం జరిగింది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై లేఖను సమర్పించారు. ఉగాది రోజున 25 లక్షల ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ప్రధానిని కోరారు సీఎం జగన్. జగన్‌తో పాటు వైసీపీ ఎంపీలు, ఆ పార్టీ ముఖ్యనేతలు విజయసాయిరెడ్డి, మిధున్ రెడ్డి సైతం సమావేశంలో పాల్గొన్నారు. మొదట ఎంపీలతో కలిసి సమావేశంలో పాల్గొన్న జగన్.. ఆ తర్వాత కాసేపు ఏకాంతంగా మోదీతో చర్చలు జరిపారు.

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం రెవెన్యూలోటును భర్తీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని, రూ.22948.76 కోట్లు రెవెన్యూ లోటుగా కాగ్‌ అంచనా వేసిందని,ఇంకా రూ.18969.26 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందని వివరించారు. వీలైనంత త్వరగా ఈ మొత్తాన్ని ఇప్పించగలరంటూ ప్రధానిని కోరారు. పోలవరం ప్రాజెక్టు అంచనాలు రూ.55549 కోట్లకు చేరిందని, ఇందులో ఆర్‌ అండ్‌ ఆర్‌ కోసమే రూ.33010 కోట్ల రూపాయలు అవసరం అవుతుందని తెలిపారు. పోలవరం అంచనాలను రూ.55549 కోట్లగా కేంద్ర జలవనరులశాఖలోని సాంకేతిక సలహా కమిటీ ఫిబ్రవరి 2019న అంచనాలు వేసిన అంశాన్ని ప్రధానికి తెలిపారు.

 

Leave a Reply