అలీ భాయ్ ఎందుకిలాగా?

Share Icons:

హైదరాబాద్, ఏప్రిల్ 15,

అలీ తెలిసే త‌న స్నేహితుడు, జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు ద్రోహం చేస్తున్నాడా?. తెలిసి తెలిసీ ప‌వ‌న్‌ని అన్ పాపుల‌ర్ చేయ‌డంలో ప్ర‌ముఖ పాత్ర పోషిస్తున్నాడా? అంటే జ‌రుగుతున్ననాట‌కీయ ప‌రిణామాలు చూస్తే అలానే అనిపిస్తోంది. ప‌వ‌న్‌ని సంప్ర‌దించ‌కుండా అత‌నికి బ‌ద్ద శ‌త్రువు లాంటి వైసీపీలో చేరిన అలీ, అక్క‌డి నుంచి ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేసిన విష‌యం తెలిసిందే. ఇది న‌చ్చ‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన బ‌హ‌రంగ స‌భ‌లో అలీ వైసీపీలో చేర‌డాన్ని త‌ప్పుప‌ట్టారు. ఆర్థికంగా అత‌న్ని ఆదుకున్నాన‌ని ప్ర‌క‌టించారు.

దీంతో హ‌ర్ట్ అయిన అలీ జ‌న‌సేనాని ప‌వ‌న్‌పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తూ యూట్యూబ్‌లో ఓ వీడియోని విడుద‌ల చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఇన్నాళ్లూ ప‌క్క‌నే వున్న స్నేహితుడు అలీ రాజ‌కీయాల కోసంఆ బంధాన్ని ప‌క్క‌న పెట్టి విమ‌ర్శ‌ల పేరుతో రోడ్డెక్క‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఎప్పుడు ఎలా త‌న‌కు స‌హాయం చేశారో చెప్పాల‌ని, వేషం ఇప్పించారా?. అవ‌స‌రానికి డ‌బ్బులు ఇచ్చారా? అని అలీ స్నేహితుడు ప‌వ‌న్‌ని నిల‌దీయ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య పెద్ద అగాధ‌మే ఏర్ప‌డింది.

ఇదిలా వుంటే ఇద్ద‌రి మ‌ధ్య వైరాన్ని పోసాని కృష్ణ‌ముర‌ళి తారా స్థాయికి చేరేలా చేశారు. `ముఖ్య‌మంత్రిగారు మీరు మాటిచ్చారు` పేరుతో పోసాని ఓ సినిమా నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో చంద్ర‌బాబు పాత్ర‌తో పాటు జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ పాత్ర కూడా వుంద‌ట‌. 2014 ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఈ సినిమా క‌థ సాగుతుంద‌ని తెలిసింది. ఇందులో ప‌వ‌న్ పాత్రని అలీతో చేయించి కించ‌ప‌రిచార‌ని తెలుస్తోంది. ప‌వ‌న్‌పై సెటైరిక‌ల్‌గా వుంటుందంటున్నారు.

మామాట: రాజకీయాల్లో రక్తసంబంధానికే విలువ లేదు.. ఇక

Leave a Reply