జ‌గ‌న్ రాజీనామా అస్త్రం!

జ‌గ‌న్ రాజీనామా అస్త్రం!
Views:
13

జ‌గ‌న్ రాజీనామా అస్త్రం!

హైద‌రాబాద్‌, ఫిబ్ర‌వరి 13ః

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తెలుగుదేశం పార్టీని మ‌రింత ఇరుకున పెట్టే తుది అస్త్రాన్ని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వై ఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప్ర‌యోగించారు.

మార్చి 5 నుంచి ఏప్రిల్ 6 వరకు హోదా కోసం పార్లమెంట్ లో పోరాడుతాం.

ఆలోగా హోదా స‌మ‌స్య పరిష్కారం కాకుంటే.. ఏప్రిల్ 6న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని వైయస్ జగన్ ప్ర‌క‌టించారు.

86వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

‘ గత 12 రోజులుగా రాష్ట్రంలో జరగుతున్న డ్రామాను అందరూ గమనిస్తూనే ఉన్నారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టబోతున్నారన్న దగ్గర నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు డ్రామాకు తెర తీశారు.

ఆయన డ్రామా ఏస్థాయిలో నడిచిందో మీ అందరికీ తెలుసు. కేంద్ర ప్రభుత్వంలో ఇద్దరు తెలుగుదేశం మంత్రులు ఉన్నారు.

బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ముందు కేంద్ర మంత్రులు అందరూ కలసి దాన్ని ఆమోదిస్తారు. ఆ సమయంలో అభ్యంతరం వ్యక్తం చేయకుండా బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత నీచ రాజకీయాలు నడిపారు చంద్రబాబు.

ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరగుతుందని చంద్రబాబుకు ముందే తెలుసు. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత అన్ని రాష్ట్రాల కన్నా మనమే ఎక్కువ సాధించాం అని ప్రకటన ఇచ్చారు.

ఏ రాష్ట్రానికి ఇంతకన్నా వచ్చాయో చెప్పాలని ప్రతిపక్షాలను ఎదురు ప్రశ్నించారు.

కలిగిరి బహిరంగ సభలో ఎంపీల రాజీనామాలపై వైయస్ జగన్ ఈ మేర‌కు ప్ర‌క‌ట‌న చేశారు.

జ‌గ‌న్ చేసిన ఈ ప్ర‌క‌ట‌న రాజ‌కీయ సంచ‌ల‌నానికి దారి తీసింది. గ‌త కొద్ది రోజులుగా పార్ల‌మెంటులో తెలుగుదేశం పార్టీ ఎంపిల‌తో బాటు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపిలు కూడా తీవ్రంగా పోరాటం చేశారు.

పార్ల‌మెంటు వెలుప‌ల లోప‌ల కూడా వారు త‌మ నిర‌స‌న వ్య‌క్త ప‌రిచారు.

అయినా కూడా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై కేంద్ర ప్ర‌భుత్వం ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.

అదే స‌మ‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ బంద్ కు కూడా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చి బంద్‌ను విజ‌య‌వంతం చేసింది.

మ‌రో వైపు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ రాజ‌కీయంగా త‌న దైన శైలిలో అడుగులు వేగంగా వేస్తుండ‌టంతో జ‌న‌సేన‌, తెలుగుదేశం పార్టీలు చేయ‌లేని విధంగా జ‌గ‌న్ మ‌రో అడుగు ముందుకు వేసి త‌మ పార్టీ ఎంపిలు రాజీనామాలు చేస్తార‌ని ప్ర‌క‌టించారు.

ఇది రాజ‌కీయాల‌ను మ‌రింత వేడెక్కించే ప‌రిణామం అన‌డంలో సందేహం లేదు.

మామాటః రాజీనామాల అస్త్రంతోనైనా కేంద్ర ప్ర‌భుత్వం దిగిరావాలి

English Summery: YSR Congress Party supremo Y.S.Jagan to day declared that his party MPs would resign from parliament if the union government resolves the special status issue for Andhra Pradesh.

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *