వైఎస్ జగన్ బర్త్ డే సందర్భంగా డిసెంబర్ 21న యాత్ర విడుదల  

Share Icons:

హైదరాబాద్, 12 సెప్టెంబర్:

దివంగత ముఖ్యమంత్రిగా రాష్ట్ర రాజకీయాల్ని తిరగరాసిన డాక్టర్ రాజశేఖర్ రెడ్డి  జీవిత చరిత్రను యాత్ర  పేరుతో భారీగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.  వైఎస్సార్ రాజకీయ జీవితంలో పాదయాత్ర కీలక ఘట్టం.. ఆ సమయంలో జరిగిన ముఖ్య సంఘటనల సమాహారమే ఈ యాత్ర. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి వైఎస్సార్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ టీజర్‌తో ఈ విషయం స్పష్టమైంది. మొదటి సింగిల్ సాంగ్ తో యాత్ర స్టోరీ లోని హై ఇంటెన్సిటీ చూపించారు.

ఆనందో బ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన దర్శకుడు మహి వి రాఘవ్ ఈ బయోపిక్‌ని తెరకెక్కిస్తున్నారు. భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్న 70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్ అత్యంత భారీ హంగులతో యాత్ర చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి శివ మేక సమర్పకుడు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి  బర్త్ డే కానుకగా యాత్ర చిత్రాన్ని డిసెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

నటీ నటులు: మమ్ముట్టి, రావు రమేష్, జగపతిబాబు, సుహాసిని, అనసూయ, పోసాని కృష్ణ మురళీ, సచిన్ ఖడేకర్, వినోద్ కుమార్, జీవా, 30 ఇయర్స్ పృథ్వి తదితరులు

మామాట: మరి ఈ యాత్ర ప్రేక్షకులని ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో….

Leave a Reply