ఎన్నిక‌ల అధికారికి వైఎస్ వివేకానంద‌రెడ్డి కుమార్తె ఫిర్యాదు!

YS Vivekananda Reddy's daughter complained to Election Commissioner
Share Icons:

అమరావతి, మార్చి21,

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి సోద‌రుడు, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చిన్నాన్న దివంగ‌త వైఎస్ వివేకానంద‌రెడ్డి కుమార్తె డాక్ట‌ర్ సునీతారెడ్డి కాసేటి క్రితం రాష్ట్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి గోపాల‌కృష్ణ ద్వివేదిని క‌లిశారు. వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసును విచారిస్తున్న సిట్ అధికారుల‌పై సీఎం చంద్ర‌బాబు అజ‌మాయిషీ చేస్తున్నార‌ని, హ‌త్య ఎవ‌రు చేశారు..? ఎందుకు చేశారు..? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు రాబ‌డుతున్న అధికారుల‌పై చంద్ర‌బాబు ఒత్తిడితెచ్చి కేసును ప‌క్క‌దారి ప‌ట్టిస్తున్నార‌ని ఫిర్యాదుచేసినట్టు సమాచారం.

వివేకానంద‌రెడ్డి హ‌త్య జ‌రిగిన అనంత‌రం సీఎం చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లు చూస్తుంటే కేసును ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు య‌త్నిస్తున్న‌ట్టు ఉంద‌ని, అలా జ‌ర‌గ‌కుండా కేసు విచార‌ణ నిష్ప‌క్ష‌పాతంగా జ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఎన్నిక‌ల అధికారికి సునీతారెడ్డి ఇచ్చిన ఫిర్యాదులో కోరారు. త‌న తండ్రి వైఎస్ వివేకానంద‌రెడ్డిని అత్యంత దారుణంగా చంపిన నిందితులను ప‌ట్టుకుని, వారికి క‌ఠిన శిక్ష‌లు ప‌డేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.

మామాట: చంద్రబాబుపై ముప్పేట దాడి… 

Leave a Reply