వివేకా హత్యకేసు…  సునీల్‌ యాదవ్ ను గోవాలో నిర్బంధించిన సీబీఐ

Share Icons:
  • హైకోర్టు ను ఆశ్రయించి పారిపోయిన సునీల్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి,   హత్యోదంతంలో కీలక అనుమానితుడిగా ఉన్న సునీల్ కుమార్ యాదవ్ ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు  తెలుస్తోంది..

వివేకానంద హత్య జరిగి రెండేళ్లయినా,  తీవ్ర జాప్యం జరుగుతోందని కుటుంబీకులు అనుమానించడం, జగన్ ప్రోద్బలంతోనే వివేకా హత్య జరిగుంటుందని టీడీపీ నేతలు ఆరోపిస్తుండటం,. ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న సీబీఐ  సునీల్ యాదవ్ ను  సునీల్‌ గోవాలో ఉన్నట్లు తెలియడంతో సీబీఐ బృందం అక్కడకు వెళ్లి సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. హైకోర్టు ఆదేశాల మేరకు వివేకా హత్య దర్యాప్తును తలకెత్తుకున్న సీబీఐ కొన్నాళ్లు విచారణ జరిపి కరోనా కారణంగా ఆపేసి, రెండో దఫా దర్యాప్తుపే ప్రారంభించి, కడప కేంద్ర కారాగారం కేంద్రంగా 57 రోజులుగా విచారణ జరుపుతున్నది. తాజాగా సునీల్ కుమార్ యాదవ్ ను అదుపులోకి తీసుకోవడం గమనార్హం.

-కె. రాంనారాయణ, సీనియర్ జర్నలిస్ట్.

Leave a Reply