“ఊపర్ షేర్వాణీ… అందర్ పరేషానీ… కేసీఆర్ కీ కహానీ” -షర్మిల వ్యంగ్యం

Share Icons:
  • అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగం.. కహానీ… అంతా అద్భుతమే!
  • బంగరు తెలంగాణ, అన్నీ అద్భుతమేనంటూ ఓ పత్రికలో కథనం- ఎద్దేవా చేసిన షర్మిల

కేసీఆర్ పాలనపై  షర్మిల స్పందించారు.  వ్యంగ్య అస్త్రాలు సంధించారు. ఆయన శాసనసభలో చేసిన ప్రసంగంపై. బంగారు తెలంగాణ అంటే ఇదేనా ధ్వజమెత్తారు .ఎలాంటి తెలంగాణను కోరుకున్నామో ఆ తెలంగాణ ఆవిష్కృతమైందని, రాష్ట్రంలో అన్నీ అద్భుతమేనంటూ . “ఊపర్ షేర్వాణీ… అందర్ పరేషానీ… కేసీఆర్ కీ కహానీ!” అంటూ ఎద్దేవా చేశారు.

“రాష్ట్రంలో కరోనా చావులు లేవు… అంతా అద్భుతమే! మూడెకరాల భూమి అందని దళితులు లేరు, డబుల్ బెడ్ రూం ఇళ్లు దొరకని పేదలు లేరు, రాష్ట్రానికి అప్పులు లేవు, తాగుబోతుల తెలంగాణ కాదు, గల్లీకొక బారు లేదు, వీధికొక వైన్ షాపు లేదు, పసిపిల్లల మీద, మహిళల మీద అత్యాచారాలు లేవు, నిరుద్యోగ చావులు లేవు, రైతుల ఆత్మహత్యలు లేవు… అంతా అద్భుతమే అంటూ ఎత్తిపొడిచారు. ఊసరవెల్లిలా రంగులు మార్చే మీ మాటలు అద్భుతం… మొత్తానికి మీ అబద్ధాల పాలన మహా అద్భుతం!” అంటూ వ్యాఖ్యానించారు.. కేసీఆర్ ప్రసంగం తాలూకు పత్రికా కథనాన్ని కూడా షర్మిల పంచుకున్నారు.

-కె. రాంనారాయణ, సీనియర్ జర్నలిస్ట్.

Leave a Reply