TRENDING NOW

ఏపీ పోలీసులపై నమ్మకం లేదన్న షర్మిల..ఖండించిన పోలీసులు..

ఏపీ పోలీసులపై నమ్మకం లేదన్న షర్మిల..ఖండించిన పోలీసులు..

విజయవాడ, 14 జనవరి:

హీరో ప్రభాస్‌తో తనకు సంబంధం ఉందంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని వైయస్ జగన్ సోదరి షర్మిల ఈరోజు హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా ఆమె ఏపీ పోలీసులపై నమ్మకం లేదంటూ కామెంట్ చేశారు. ఇక ఈ వ్యాఖ్యలపై ఏపీ పోలీసు అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ రాష్ట్ర పోలీసు సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ, షర్మిళ వ్యాఖ్యలు బాధాకరమని, తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.

సంఘటన ఏ రాష్ట్ర పరిధిలో జరిగితే, అక్కడే కేసులు నమోదవుతాయని, రానున్న రోజుల్లో వారి ప్రభుత్వం (వైసీపీ) వచ్చినా… రాష్ట్రంలోని అన్ని కేసులను ఏపీ పోలీసులే విచారించాల్సి ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలోని 60వేల మంది పోలీసుల మనోభావాలను షర్మిళ దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా,  గతంలో కూడా ఇదే రకమైన వ్యాఖ్యలను జగన్ చేశారని… ఆయన వ్యాఖ్యలను కూడా అప్పట్లో తాము ఖండించామని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలతో పోలీసులపై అపనమ్మకం ఏర్పడుతుందని… ఇది సమాజానికి మంచిది కాదని చెప్పారు. పార్టీలకు సంబంధించి ఏదైనా ఉంటే రాజకీయపరమైన విమర్శలు చేసుకోవాలని… పోలీసులను కించపరిచేలా మాట్లాడటం మాత్రం దారుణమని అన్నారు.

మామాట: ఎన్నికలకి ముందు ఈ కేసు సంచలనం రేపుతోందిగా

(Visited 136 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: