నమ్మకం కావాలి బాబూ నమ్మకం

Share Icons:

తిరుపతి, నవంబర్ 12,

రాజకీయాలంటే అధికారసోపానవిన్యాసాలనిలయాలు. అక్కడ అవసరం అయితే అందరూ కావాలి. అవసరం లేదనుకుంటే ఎవరూ వద్దు.

[pinpoll id=”64909″]

గత పక్షంలో విశాఖ విమానాశ్రయంలో ప్రతిపక్షనేత జగన్ పై హత్యాయత్నం జరిగింది. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం జరక్కుండా జగన్ తప్పించుకున్నారు. అయితే ఈ సంఘటన కోడి కత్తి వివాదంగా రాష్ట్రరాజకీయాల్లో చక్కర్లు కొడుతూనే ఉంది. రోజుకొక వివాదం, వాదన తెరపైకి వస్తున్నాయి. తాజాగా జగన్ తల్లి, వైయస్ విజయమ్మ హైదరాబాద్ లోని లోటస్ పాండ్ నివాసంలో ఆదివారం మీడియా సమైవేశం నిర్వహించి మరి కాస్త మదర్ సెంటిమెంట్ దట్టించారు.

సోమవారం నుంచే జగన్ మళ్లీ తన ప్రజాసంకల్పయాత్రను విశాఖ జిల్లా నుంచే మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో విజయమ్మ మాట్లాడుతూ, తన కొడుక్కి కేంద్రబలగాల రక్షణ కోరే పనిలో పార్టీ వర్గాలున్నాయనీ, ఏపీ పోలీసులపై నమ్మకమున్నా,  ఏపీ ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదనే వ్యాఖ్యలు చేశారు.  ఏపీ డీజీపీ పైనా, ముఖ్యమంత్రి వ్యవహార శైలిపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొత్తం మీద విశాఖలో జగన్ పై జరిగిన దాడిలో దర్యాప్తుతీరుతెన్నలను విజయమ్మ ప్రశ్నించారు.

దర్యాప్తు సక్రమంగా జరగడంలేదని, పెద్దలు హడావుడి ప్రకటనలు చేసి నిజాలను నీరుగారుస్తున్నారనీ ఆరోపించారు. వీటిని మీరెలా స్వీకరిస్తారు. ఆమె అభిప్రాయంతో ఏకీభవిస్తారా..

మామాట: దర్యాప్తుకు సహకరించనివారు కూడా ఆరోపణలు చేయవచ్చా..

Leave a Reply