కుట్రచేసిందెవరో..?

Share Icons:

తిరుపతి, అక్టోబర్ 29,

కారే రాజులు రాజ్యముల్ గలుగవే.. వారేరీ.. అంటూ మనకు చాలాకాలంగా ఓ పద్యం తెలుసు. కానీ ఇవ్వాళ పాలకులు ఎవరూ ఈ పద్యం చదివినట్టు అనిపించదు. లేకపోతే చదువుకున్నా మరచిపోయినట్టు నటిస్తున్నారేమో తెలియదు.

 

 
 [pinpoll id=”64325″] 
 

ఇపుడు పద్యాల గొడవ ఎందుకు కానీ, రాష్ట్రంలో జరుగుతున్న హత్యారాజకీయాలకు సంబంధించి తాజా వాతావరణం రణగొణ ధ్వనులతో గందర గోళంగా ఉంది.  ప్రతిపక్ష నేతపై అత్యంత ఉన్నతస్థాయి రక్షణ ఉండే విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగింది. దీనికి ఎవరు బాధ్యత వహించాలి. రాష్ట్రప్రభుత్వమా, కేంద్రప్రభుత్వమా, ప్రధాని మోదీనా, విమానయాన శాఖా మంత్రిగారా… లేక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబా… ఎవరు.

వాస్తవం ఏమిటో విచారణలో తెలియాలి, కానీ కలికాలం మాయ.. విచారణ కంటే ముందుగానే ఎవరి తీర్పు వాళ్లు ప్రకటించేస్తున్నారు. ఇంతకూ జగన్ ను అంతం చేస్తే లాభించేది ఎవరికి? ప్రయోజనం కలిగేది ఎవరికి?  సహజంగా అనుమానం  వారి వైపు వెళ్లాలి. మరి జరుగుతున్న వాద వివాదాలు గందరగోళం కలిగిస్తున్నాయి. పోలీసులేమో తమ రిమాండు రిపోర్టులో హత్యవెనుక కుట్ర కోణం ప్రస్థావనే చేయలేదు. అయితే జగన్ పై దాడి మాత్రం  హత్యాయత్నమే అని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు సీ.ఎం. చంద్రబాబే ప్రధాన కుట్రదారుడని ఆరోపిస్తున్నారు. పార్టీ నేత భూమన కరునాకర్ రెడ్డి ఏకంగా బాబు చరిత్ర మొత్తం రక్తసిక్తం అని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంతకూ వర్తమాన రాజకీయనేపథ్యంలో ప్రతపక్షనేతపై జరిగిన దాడికి పథక రచన చేసిందెవరు. అమలుచేసే బాధ్యత తీసుకుందెవరు. నిజాలు విలుగు చూస్తాయా? మీరేమనుకుంటున్నారు?

మామాట : ఇది అన్ని వర్గాలు సంయంమనం పాటించవలసిన సమయం

Leave a Reply