టీటీడీ ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త

Share Icons:

టీటీడీ ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఉద్యోగుల‌కు ఇంటిస్థ‌లాల కేటాయింపునకు రాష్ట్ర ప్ర‌భుత్వం అంగీక‌రించింది. 400 ఎక‌రాల ప్ర‌భుత్వ స్థ‌లం ఉద్యోగుల కోసం కేటాయించాల‌ని గ‌తేడాది డిసెంబ‌ర్‌లో టీటీడీ పాల‌క‌మండ‌లి తీర్మానం చేసింది. టీటీడి తీర్మానాన్ని రాష్ట్ర‌ ప్ర‌భుత్వానికి అప్ప‌ట్లో పంపింది.. తాజాగా ఈ తీర్మానానికి జగన్ సర్కార్ అంగీకారం తెలిపింది. దీనికి సంబంధించి ఉత్త‌ర్వుల‌ను జారీ చేసింది ప్ర‌భుత్వం. రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని టీటీడీ ఉద్యోగులు స్వాగ‌తించారు.

 

-నందిరాజు రాధాకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్.

Leave a Reply