సీఎం అయ్యాక జగన్ తొలిసారి ఘాటు విమర్శలు….

ys jagan sensational comments on pawan kalyan
Share Icons:

అమరావతి: జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతిపక్షాలపై పెద్దగా విమర్శలు చేయకుండా సైలెంట్ గా పని చేసుకుంటూ వెళ్లిపోతున్న విషయం తెలిసిందే. అయితే ఇంతకాలం సైలెంట్ గా ఉన్న జగన్ హఠాత్తుగా ఘాటు విమర్శలు చేశారు. ఏపీలో అన్నీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశం పెట్టడంపై జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విమర్శలని తిప్పికొట్టడంలో భాగంగా జగన్ పవన్ కల్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

జాతీయ విద్యాదినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్‌‌లో అబుల్‌ కలాం విద్యా పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. ఈ వేడుకల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయులు, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. అనంతరం కార్యక్రమంలో మాట్లాడిన జగన్.. ఇంగ్లీష్ బోధనపై విమర్శలు గుప్పించిన వారికి స్ట్రాంగ్ కౌంటర్, ప్రశ్నల వర్షం కురిపించారు.

పేదలు కూడా రాణించాలంటే.. ఇంగ్లీషు మీడియం చదువులు ముఖ్యమని, ఇంగ్లీష్ రాకుంటే.. ప్రపంచంలో మన వాళ్లు పోటీ పడలేరని చెప్పరు.  ప్రభుత్వ పాఠశాలల్లో వారం రోజుల క్రితం జీవో ఇచ్చామని, దీనిపై చంద్రబాబు, వెంకయ్య, పవన్ కళ్యాణ్ వంటి వారి నోళ్లు తెరచుకున్నాయని అన్నారు. మన పిల్లలకు మంచి చేస్తే విమర్శలు ఎందుకు..?. ఇటువంటి మాటలు మాట్లాడేవారు ఒకసారి ఆలోచన చేయాలని, మీ కొడుకులు, మనవళ్లు ఏ మీడియంలో‌ చదువుతున్నారని, ఇంగ్లీష్‌ మీడియాన్ని వ్యతిరేకించేవారు.. వారి పిల్లలను ఏ మీడియంలో చదివిస్తున్నారు..? అని ప్రశ్నించారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మనవళ్లు ఏ స్కూల్‌లో చదువుతున్నారో చెప్పాలి..?. యాక్టర్ పవన్ భార్యలకు ఐదుగురు పిల్లలు.. వాళ్లు ఏ స్కూల్లో చదువుతున్నారు.?” అని ఈ సందర్భంగా విమర్శలకు వైఎస్ జగన్ సూటి ప్రశ్నలు సంధించారు.

ఇక మనం మన పిల్లలకు ఇచ్చే నిజమైన ఆస్తి.. మంచి చదువని, ఆ దిశగా అడుగులు వేస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుందని,  ప్రభుత్వ పాఠశాలల్లో రూపురేఖలు మార్చాలనే ‘నాడు- నేడు’ కార్యక్రమం అని చెప్పామని అన్నారు. ప్రతి పాఠశాలలో ఇంగ్లీషు ల్యాబ్‌లు పెట్టాం. వచ్చే ఏడాది నుంచి ఇంగ్లీషు మీడియం తప్పనిసరి.. తెలుగు కానీ హిందీ కానీ రెండో భాష. ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీషు మీడియంలోనే ఆ తర్వాత ప్రతి ఏడాది 7,8,9,10 నాలుగేళ్లలో పది వరకు అమలు చేస్తామని చెప్పారు.

త్వరలో పూర్తిస్థాయిలో ఫీజురీయంబర్స్‌మెంట్ ఇస్తాం. మదర్సా బోర్డును ఏర్పాటు చేస్తాం. మదర్సాల్లో చదివే విద్యార్థులకు కూడా అమ్మ ఒడి పథకం. వైఎస్‌ఆర్‌ పెళ్లికానుక పథకం కింద రూ.లక్ష ఇస్తాం. చంద్రబాబు ఇచ్చిన డబ్బు కన్నా రెట్టింపు ఇస్తాం’ అని వైఎస్ జగన్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

 

Leave a Reply