వైఎస్ జ‌గ‌న్ సొంత స‌ర్వే అవుట్‌..!?   

Share Icons:

హైదరాబాద్, ఏప్రిల్ 19,

వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి పార్టీ వ్య‌వ‌హారాల‌ను న‌డుపుకోవ‌డం ఒక ఎత్తైతే.. ఆ పార్టీ కార్య‌క్ర‌మాల వ్యూహాల‌ను ర‌చిస్తున్న ప్ర‌శాంత్ కిశోర్ స‌ర్వే రిపోర్టుల‌ను తెప్పించుకోవ‌డం మ‌రో ఎత్తు. ఇలా ప్ర‌శాంత్ కిశోర్ స‌ర్వేల‌ను ఈ ఏడాది ఏప్రిల్ 11న జ‌రిగిన ఎన్నిక‌ల‌కు ముందు మాత్ర‌మే కాకుండా, ఎన్నిక‌ల త‌రువాత ర‌హ‌స్య ఎగ్జిట్ పోల్స్‌పై వైఎస్ జ‌గ‌న్ స‌మీక్ష‌లు జ‌రిపారు.

కేవ‌లం ఒక్క ప్ర‌శాంత్ కిశోర్ స‌ర్వేపై మాత్ర‌మే ఆధార‌ప‌డ‌కుండా మొత్తంగా ఆరు స‌ర్వే రిపోర్టుల‌ను వైఎస్ జ‌గ‌న్ తెప్పించుకున్నారట. అందులో ప్ర‌శాంత్ కిశోర్ టీమ్ కాకుండా జ‌గ‌న్‌కు సంబంధించిన సొంత టీమ్ స‌ర్వేలు కూడా ఉన్నాయ‌ని, ఆ టీమ్ ఎన్నిక‌ల‌కు ముందు, ఆ త‌ర్వాత చేసిన రిపోర్టుల‌ను జ‌గ‌న్ తెప్పించుకున్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.

అయితే, జ‌గ‌న్ ఎక్కువ‌గా న‌మ్మే స‌ర్వే రిపోర్టుల ప్ర‌కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ 80 పైగా అసెంబ్లీ స్థానాల‌ను క‌చ్చితంగా గెలుపొందుతుంద‌ని, ఆపైగా సీట్లు వ‌చ్చే అవ‌కాశాలు కూడా మెండుగా ఉన్నాయ‌ని ఆ స‌ర్వేలు పేర్కొన్నాయి.

మ‌రికొన్ని స‌ర్వేలు 90కి పైగా సీట్లు క‌న్ఫామ్ అని డిక్లేర్ చేశాయి. జ‌గ‌న్‌కు అందిన ఆరు స‌ర్వేల్లో ఒక స‌ర్వే మాత్రం వైసీపీ 130 సీట్ల‌ను గెలుపొందుతుంద‌ని చెప్పిందిట.  ఇలా, వైసీపీ నిర్వహించిన అన్ని సర్వేల ప్ర‌కారం పార్టీ అధికారంలోకి రావ‌డం మాత్రం ప‌క్కా అనే సంకేతాల‌ను వచ్చాయి. ఆ స‌ర్వేల్లో వైసీపీ పెద్ద‌లు ద‌గ్గ‌రుండి చేసినవి కూడా కొన్ని ఉండ‌టం గ‌మ‌నార్హం.

వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ చేయించిన సొంత స‌ర్వేలో మాత్రం ఆ పార్టీకి 117 నుంచి 120 సీట్లు గెలుపొందనున్నట్టు సమాచారం. ఇది జ‌గ‌న్ ద‌గ్గ‌రుండి త‌న టీమ్‌తో చేయించిన స‌ర్వే క‌నుక ఈ స‌ర్వేపై మ‌రింత న‌మ్మ‌కం పెరుగుతోందంటూ ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. మ‌రి అది ఎంత వ‌ర‌కు వాస్త‌వ‌మ‌న్న‌ది మే 23న ఎన్నిక‌ల ఫ‌లితాల విడుద‌ల అనంత‌రం తేల‌నుంది.

మామాట: ఫలితాలు ఉగాది పంచాంగాలు కాదు కదా

Leave a Reply