జగన్ సరికొత్త ప్లాన్…అందుకే చిరంజీవికి దగ్గరవుతున్నారా?

ys jagan new strategy to close chiranjeevi
Share Icons:

అమరావతి: ఏపీ రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవరికి అర్ధం కాదు. పరిస్థితులని బట్టి నేతలు రాజకీయాకు చేస్తుంటారు. ఏపీలో ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుంచి టీడీపీ మళ్ళీ పుంజుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా పాత మిత్రులు బీజేపీ, పవన్ కల్యాణ్ లకు దగ్గర అయ్యేందుకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబు రాజకీయ ఎత్తులని చిత్తు చేసేందుకు వైసీపీ అధినేత, సీఎం జగన్ కూడా సరికొత్త ఎత్తులని వేస్తున్నారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్న చిరంజీవి మద్ధతు పరోక్షంగా తీసుకునేందుకు జగన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

రాజకీయాలకు దూరమైన చిరంజీవికి మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ ఫాలోయింగ్ ని క్యాష్ చేసుకోవాలని జగన్ ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా జగన్ ప్రభుత్వం సైరా సినిమాకు ఎక్స్ ట్రా షోలకు పర్మిషన్ ఇచ్చారు. అయితే దీనికంటే ముందోచ్చిన సాహో సినిమాకు పర్మిషన్ ఇవ్వని జగన్ ప్రభుత్వం.. సైరా సినిమాకు పర్మిషన్ ఇవ్వడం విశేషం. అలాగే సైరా సినిమా ప్రమోషన్ అనుమతులను చిత్ర నిర్మాతలు సీఎం జగన్ సొంత మీడియాకు అప్పగించారు. చిరంజీవి రాజకీయాల్లో లేకపోయినా..ఆయనకు అభిమానుల్లో ఉన్న క్రేజ్ పరోక్షంగా ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వానికి పాజిటివ్ గా మారుతుందని అంచనా వేసింది.

ఇదిలా ఉంటే తాజాగా తాడేపల్లిగూడెం వైసీపీ కాపు నేతలు చిరంజీవి చేత దివంగత నటుడు ఎస్‌వి రంగారావు విగ్రహావిష్కరణ చేయించారు. ఈ కార్యక్రమం మొత్తం స్థానికీ వైసీపీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగింది. ఇక అక్కడ ప్రభుత్వం పరంగా రావాల్సిన అనుమతులుని కొట్టు సత్యనారాయణ క్లియర్ చేయించారు. అదే విధంగా చిరంజీవి సైరా సినిమాతో బీజీగా ఉన్నా..ఆయన వచ్చి విగ్రహావిష్కరణ చేసే దాకా ఎదురు చూసారు. ఇక, చిరంజీవి తాడేపల్లి గూడెం పర్యటనలో వైసీపీ నేతలు చాలా క్లోజ్ గా చిరంజీవితో ఉండటం రాజకీయంగా చర్చకు కారణమైంది. ఆయన సైతం వైసీపీ నేతలను అభినందనలతో ముంచెత్తారు. ఇక్కడొక విశేషం ఏమిటంటే ఈ కార్యక్రమంలో టీడీపీ,కాంగ్రెస్,బీజేపీ నేతలు పాల్గొన్న జనసేన నేతలు మాత్రం హాజరుకాలేదు.

ఎందరు ఉన్న అక్కడ వైసీపీ నేతలే ముఖ్యపాత్ర పోషించారు. చిరంజీవితో క్లోజ్ గా మూవ్ అయ్యారు. ఈ పరిణామాలని గమనిస్తుంటే…గత ఎన్నికల్లో టీడీపీకి, జనసేనకు మద్ధతు తెలిపిన మిగిలిన కాపు సామాజికవర్గాన్ని తమ వైపు తిప్పుకునేందుకే జగన్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. చిరంజీవి రాజకీయాల్లో లేరు కాబట్టి..ఆయనతో సఖ్యతగా ఉన్న సంకేతాలు ఇవ్వటం ద్వారా మెగా అభిమానుల మద్దతు పొందడానికే ఇలా చేస్తున్నారని సమాచారం.

 

 

Leave a Reply