స్థానిక సంస్థ ఎన్నికల్లో క్లీన్ స్వీపే లక్ష్యంగా వైసీపీ కొత్త ఎత్తులు….

CM YS Jagan Mohan Reddy to address CRDA meeting on Amaravati capital
Share Icons:

అమరావతి: ఊహించని విధంగా అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పరచిన వైసీపీ…పాలనలో దూసుకుపోతుంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి నాలుగు నెలల కాలంలో సరికొత్త నిర్ణయాలు తీసుకుని కొత్త చరిత్రని సృష్టిస్తున్నారు. ఇప్పటికే పలు పథకాల ద్వారా ప్రజలని ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళేందుకు చూస్తున్నారని తెలుస్తోంది. అందుకే ప్రజా సంక్షేమ పథకాలు, గ్రామ సచివాలయాలు పెట్టి గ్రామీణ ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టారు.

దీంతో పాటు టీడీపీ బలంగా ఉన్న కొన్ని జిల్లాలో నేతలనీ పార్టీలో చేర్చుకునేందుకు చూస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు వైసీపీలో చేరిపోయారు. మరికొందరిని కూడా పార్టీలోకి తీసుకురావడానికి చూస్తున్నారు. అందులోనూ..ఉభయ గోదావరి జిల్లాలతో విశాఖపట్నం టీడీపీ నేతలనీ ఆకర్షిస్తున్నారు. ఇటీవలే తూర్పులో తోట త్రిమూర్తులు, వరుపుల రాజా లాంటి నేతలు వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. అలాగే పశ్చిమలోని కొందరు నేతలు వైసీపీ కండువా కప్పుకోడానికి చూస్తున్నారు. అలాగే విశాఖలోమొన్న ఎన్నికల్లో టీడీపీ తరుపున అనకాపల్లి ఎంపీగా పోటీ చేసిన ఆడారి ఆనందరావు కుటుంబం వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు.

అదేవిధంగా కొందరు మాజీ ఎమ్మెల్యేలతో పాటు, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా వైసీపీలోకి వస్తారని తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలలోపు ఈ కార్యక్రమాలని పూర్తి చేసి రాష్ట్రం మొత్తం స్థానిక సంస్థ ఎన్నికల్లో సత్తా చాటాలని జగన్ చూస్తున్నారు. అటు చంద్రబాబు కూడా స్థానిక సంస్థల్లో మెజారిటీ సీట్లు గెలుచుకోవాలని అనుకుంటున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులు టీడీపీకి అనుకూలంగా లేవు.

ఎందుకంటే చాలా మంది నాయకులు, పార్టీలో మొదటి నుంచి ఉన్న వారు సైతం బీజేపీ లేదా వైసీపీలోకి పోతున్నారు. మరి బాబు పార్టీని చక్కదిద్దుకునేందుకు చేయలసిన మ్యాజిక్కులు అన్నీ చేసినా ప్రయోజనం మాత్రం శూన్యం అంటున్నారు. జగన్ ఏమో నిదానంగా టీడీపీని దెబ్బతీయాలని ప్లాన్ వేస్తున్నారు. ఆ పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులను, బలమైన నేతలను వైసీపీ వైపుగా తీసుకురావాలనుకుంటున్నారు. కోస్తా జిల్లాలలపైన జగన్ టార్గెట్ పెట్టారు. ముఖ్యంగా ఆపరేషన్ గోదావరి అంటూ జగన్ ఆ జిల్లాల మీద గురి పెట్టారు. దాంతో టీడీపీ బలం బాగా తగ్గిపోతోంది.

రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలిచేలా అనేక పధకాలు జగన్ ఇప్పటికే ప్రకటించారు. అవి అమలు అవుతున్నాయి కూడా. కొత్త ప్రభుత్వంపై మోజు కూడా బాగానే ఉంది. దానికి తోడు అధికార బలం ఉంది. దీంతో ఇక టీడీపీకి అన్ని విధాలుగా దెబ్బ పడుతుందని అంటున్నారు. మరి చూడాలి స్థానిక సంస్థల్లో ఎవరి సత్తా ఎంత ఉంటుందో .

 

Leave a Reply