
హైదరాబాద్, ఫిబ్రవరి 09,
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ లో దొంగ ఓట్ల నమోదు, ఇదివరకే ఉన్న ఓట్ల తొలగింపు వ్యవహారంపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేశారు. గవర్నర్ తో ఆయన దాదాపు గంటన్నరకు పైగాసమావేశమయ్యారు. కాగా, ఇటీవల కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలనే గవర్నర్ తో జగన్ ప్రస్థావించినట్టు సమాచారం.
గవర్నర్ తో భేటీ తర్వాత వైఎస్ జగన్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించి, స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని గనర్నర్ కి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో దొంగ ఓట్లను జాబితాలో చేరుస్తూ తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారన్నారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబే కారణమన్నారు. నాలుగేళ్లు బిజెపిని భుజాన మోసింది చంద్రబాబు కాదా అని జగన్ ప్రశ్నింతారు. ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినా అని వ్యాఖ్యానించింది కూడా చంద్రబాబేనని ఈ సందర్భంగా జగన్ గుర్తుచేశారు. ఢిల్లీలో చంద్రబాబు దీక్షపై ఆయన తీవ్రమైన వ్యాఖ్య చేశారు. ఓ హత్య చేసిన వ్యక్తే హత్యకు వ్యతిరేకంగా దీక్ష చేస్తున్నట్లుగా చంద్రబాబు ఢిల్లీ దీక్ష ఉందని జగన్ అన్నారు.
మామాట: పోరాటం కొనసాగించండి … పాపాలకు చెక్ పెట్టండి