విశాఖపట్టణం, 10 సెప్టెంబర్:
నాలుగున్నరేళ్లు బీజేపీతో కలిసి కాపురం చేసినప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు గానీ, ప్రత్యేక హోదా గానీ గుర్తుకు రాలేదా? అని జగన్ సూటిగా ప్రశ్నించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా ముగిసింది.
రోజు ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా సోమవారం ఉదయం వైఎస్ జగన్ విశాఖపట్నం నియోజకవర్గంలోని తాటిచెట్లపాలెం నుంచి పాదయాత్ర ప్రారంభించారు.
బాబు ఎక్కడ అడుగుపెడితే అక్కడ ధ్వంసమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఎస్టీలోకి పెట్రో ఉత్పత్తులు రాకుండా అడ్డుకున్నది మీరు కాదా అని ప్రశ్నించారు..
“విశాఖపట్నంలో భాగస్వామ్య సదస్సులు పెడతుంటారు. మూడు రోజుల పాటు మీటింగ్‌లు పెట్టి రాష్ట్రానికి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలొచ్చాయని చెబుతాడు ఈ పెద్దమనిషి (చంద్రబాబు). మీకెక్కడైనా కనిపించాయా?” అంటూ విమర్శలు గుప్పించారు.
ఎన్ని వేల కోట్ల పరిశ్రమలొచ్చాయో తెలుసుకునేందుకు ఓ సంస్థ ఉందని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో డిపార్టుమెంట్ ఆఫ్ ఇండిస్ట్రీ పాలసీ అండ్ ప్రమోషన్.. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్‌లో ఉందని ప్రజలకు తెలియజేశారు.
వైఎస్ జగన్ రాకతో పాదయాత్ర సాగే మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. అడుగడుగునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారు.
అక్కయ్య పాలెం, దొండపర్తి జంక్షన్, తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు పాదయాత్ర సాగనుంది. ఆర్టీసీ కాంప్లెక్స్‌కు చేరుకున్న తర్వాత భోజన విరామం తీసుకున్నారు.
వాల్తేరులో బ్రహ్మణుల ఆత్మీయ సదస్సులో వైఎస్ జగన్ పాల్గొన్నారు. వాల్తేరు మెయిన్ రోడ్డు మీదుగా చిన్న వాల్తేరు వరకు జననేత పాదయాత్ర కొనసాగింది.
మామాట: అధికారంలోకి వస్తే అందరూ అలాగే చెబుతారేమో జగన్ గారు...