జగన్  ప్రచారం రూట్ మ్యాప్!

Share Icons:

హైదరాబాద్, మార్చి 14,

త్వరలో జరగనున్న ఏపీ శాసన సభ ఎన్నికలకు సంబంధించి,  పార్టీ సారథి జగన్ ఎన్నికల పర్యటన వివరాలను పార్టీ కార్యాలయం గురువారం విడుదల చేసింది.  ఎన్నికలకు సమయం చాలా తక్కువగా ఉండడంతో ఇప్పటికే జగన్ తన బస్సు యాత్రను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే.  కాగా ప్రస్తుతం ప్రత్యేక హెలికాఫ్టర్ లో జగన్ రాష్ట్ర పర్యటన సాగనుంది. మొదటి విడతగా గతంలో పాదయాత్రలో లేని  నియోజకవర్గాల్లో జగన్ ప్రచారం సాగుతుంది.

మార్చి 16 వ తేదీన ఇడుపుల పాయలో దివంగత వైయస్ సమాధి వద్ద నివాళి అర్పించి ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని జగన్ భావిస్తున్నారు. కాగా 16 నుంచి 20 వరకు రోజుకు మూడు ఎన్నికల ప్రచార సభల్లో జగన్ పాల్గొంటారు. రెండవ దశలో మార్చి 21 నుంచి ఏప్రిల్ 1 వ తేదీ వరకు రోజుకు నాలుగు సభల్లో పాల్గొంటారు. ఏప్రిల్ 1వ తేదీ తరువాత రోజుకు 5 సభల్లో పాల్గొనడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం.

మార్చి 16న ఇడుపుల పాయలో బయలు దేరి గురజాల నియోజకవర్గంలో పిడుగురాళ్ల సభలో పాల్గొంటారు.  మార్చి 17వ తేదీన నర్శీపట్టణం, భోగాపురం, అంబాజీపేట సభల్లో ప్రసంగిస్తారు.  మార్చి 18 వ తేదీన ఓర్వకల్లు, రాయదుర్గం, రైల్వేకోడూరు లలో సభల్లో పాల్గొంటారు. తదుపరి వివరాలు ప్రకటింవలసి ఉంది.

అలాగే వైసీపీ ఎన్నికల సభల్లో జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిళ కూడా పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

 

మామాట: ప్రచారంలో సుడిగాలి పర్యటన అనమాట… 
 

Leave a Reply