జగన్ లేఖకు తక్షణ స్పందన…

Share Icons:
 -6.40 లక్షల టీకా డోస్ లు ఇచ్చిన కేంద్రం!
-నిన్న రాత్రి 4.40 లక్షల డోస్ లు
-నేడు మరో 2 లక్షల డోస్ లు
———————-

 రాష్ట్రంలో టీకా నిల్వలు నిండుకుంటున్నాయని, వెంటనే టీకాలు పంపించాలని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ రాసిన లేఖపై కేంద్రం స్పందించింది. నిన్న రాత్రి గన్నవరం విమానాశ్రయానికి 4.40 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోస్ లు వచ్చాయి. నేడు హైదరాబాద్ నుంచి మరో రెండు లక్షల టీకా డోస్ లు రానున్నాయని తెలుపుతూ, వైద్య మంత్రి ఆళ్ల నాని కృతజ్ఞతలు చెప్పారు.

వైఎస్ జగన్ లేఖ రాసిన 24 గంటల వ్యవధిలోనే డోస్ లు రాష్ట్రానికి వచ్చాయని, ఈ సందర్భంగా ప్రజలు, ప్రభుత్వం తరఫున కేంద్రానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆళ్ల నాని వ్యాఖ్యానించారు. వచ్చిన వయల్స్ ను అన్ని జిల్లాలకూ పంపించనున్నామని, 45 ఏళ్లు దాటిన వారందరికీ టీకా అందించేందుకు చర్యలు చేపట్టనున్నామని అన్నారు.

-కె రాంనారాయణ, జర్నలిస్ట్.

Leave a Reply