సిట్టింగ్‌కి షాక్…మదనపల్లి బరిలో మైనార్టీ అభ్యర్ది…

Share Icons:

చిత్తూరు, 9 మార్చి:

రాబోయే ఎన్నికల్లో అధికార టీడీపీని ఎదుర్కునేందుకు బలమైన అభ్యర్ధులని బరిలో దించుతున్న వైసీపీ అధినేత జగన్…. మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మదనపల్లిలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తిప్పారెడ్డికి టికెట్ నిరాకరించారు.

కాగా, గత ఎన్నికల్లో చిత్తూరు జిల్లా నుంచీ మైనారిటీలకు అవకాశం ఇవ్వని నేపథ్యంలో  ఈ సారి మాత్రం మదనపల్లె లేదా పీలేరు స్థానాన్ని మైనారిటీకి కేటాయించాలని జగన్‌ భావించారు. 

అయితే పీలేరులో టీడీపీ అభ్యర్థి నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డిని ఎదుర్కొనడానికి మైనారిటీ అభ్యర్థి సరిపోరన్న అభిప్రాయంతో అక్కడ చింతల రామచంద్రారెడ్డికే అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు.
 
ఇక దీంతో పక్కనే ఉన్న మదనపల్లెలో మైనారిటీ అభ్యర్థికి ఇస్తే సరిపోతుందన్న అభిప్రాయానికి వచ్చారు. ఈ క్రమంలోనే జగన్‌ మదనపల్లె సీటు మైనారిటీ అభ్యర్థి నవాజ్‌కు ఇవ్వడానికి సిద్ధాంయ్యారు.

ఇక ఇదే విషయాన్ని తిప్పారెడ్డికి జగన్ తేల్చి చెప్పారు. అయితే టికెట్ తనకే దక్కుతుంది అనుకున్న తిప్పారెడ్డికి ఊహించని షాక్ తగిలింది.

మామాట: పార్టీ బలపడాలంటే ఇలాంటి నిర్ణయాలు తప్పవు

Leave a Reply