జగనే సిఎం… మోహన్ బాబు

Share Icons:

భీమవరం,ఏప్రిల్ 05,

ఈ ఎన్నికల్లో విజయం  సాధించి జగన్ రాష్ట్రముఖ్యమంత్రి కావడం ఖాయమని మోహన్ బాబు అన్నారు.   మోహన్‌బాబు   భీమవరంలోని ప్రకాశంచౌక్‌ సెంటర్‌లో జరిగిన వైఎస్‌ఆర్‌సిపి సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు తెలంగాణ సిఎం కెసిఆర్‌, కెటిఆర్‌లను పొగడ్తలతో ముంచెత్తారు. చంద్రబాబు పెద్ద గజదొంగ అన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు.

జగన్‌పై 40 కేసులు ఉన్నట్లుగా చంద్రబాబు ప్రచారం చేయిస్తున్నారని, జగన్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. సినిమాలు, రాజకీయాలు వేరువేరని స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ పరోక్షంగా పవన్‌కల్యాణ్‌ను విమర్శించారు. చంద్రబాబు దొంగ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్లమెంట్‌ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు ను కూడా గెలిపించాలని కోరారు.

మామాట: మోహన్ బాబు రూటే సపరేటు

Leave a Reply