మీ టూ-మెన్ టూ

Share Icons:

అదంతా అయోమయంగా, పెద్ద గందర గోళంగా ఉంది. కోర్టుల తీర్పులు, ప్రజల తీరు తెన్నులు, సోషల్ మీడియాలో గేట్లు తెగి పారుతున్న భావజలధి. అంతా గమనించినపుడు ఆందోళన కూడా కలుగుతోంది.

[pinpoll id=”64017″]

 

ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా మీటూ అంటూ ఒక ఉద్యమం మొదలైంది. అదే మంటే… చాలా కాలం తరువాత,, అపుడెపుడో చాలా ఏళ్ల క్రితం ఫలానా వ్యక్తి ( ఆయన ఇపుడు ప్రముఖుడై ఉంటాడు లెండి) తనకు ఉద్యోగం ఇస్తాననో, పదోన్నతి కల్పిస్తాననో, సినిమా, టీవీ, మోడలింగ్ ఛాన్సుల పేరుతో అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించడం, అది ఎంతవరకు వాస్తవం. అనేది ఎలా తెలుసుకోవడం.. అనే ఆలోచన లేకుండా ఆరోపించిన మహిళ గ్లామర్ బట్టీ ప్రాచుర్యం లభిస్తోంది.  ఈ వివాదాంలో తాజాగా కేంద్ర సహాయ మంత్రి ఒకరు తన పదవికి రాజీనామా చేయాల్సివచ్చింది. ఈ నేపథ్యంలో ఇపుడు మెన్ టూ అంటూ గతంలో మహిళా బాస్ లు తమపై అత్యాచారం చేశారని మగపుంగవులు ఆరోపించడం మొదలైంది. 15 మందితో బెంగలూరులో ఓ సంస్థ మొదలైంది ఇందులో ఫ్రెంచ్ మాజీ దౌత్యవేత్త కూడా ఉండడం విశేషం.

జీవితంలో ఎంతో కష్ట పడి పైకి వచ్చి, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న మగవారిని, మీటూ అంటూ వేధించడం న్యాయమేనా, బాధిత మహిళలు తమ వద్ద ఉన్న ఆధారాలతో కోర్టుకు వెళ్లకుండా, పోలీసులకు ఫిర్యాదుచేయకుండా, సామాజిక మాధ్యమాలలో అల్లరిపెట్టడం ఎంతవరకు సమంజసం అన్నది వీరి ప్రశ్న. ఇంతకీ మీరేమంటారు. వీటిని సమర్థిస్తారా… మనకెందుకులే అని తప్పించుకుతిరుగువాడు ధన్యుడు సుమతీ అంటూ వెళ్లిపోతారా.

మామాట: ఇక వుయ్ టూ అని రావాలేమో నెక్స్ట్ సీజన్లో..

Leave a Reply