TRENDING NOW

బాధ-బాధ్యత నావే.. జగన్

బాధ-బాధ్యత నావే.. జగన్

అనంతపురం, ఫిబ్రవరి 11,

పార్టీ కార్యకర్తలకు అన్నిసమయాలలో అండగా ఉంటామనీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తగిలే ప్రతి గాయం తన గుండెకు తగిలిన గాయంగా భావిస్తానని వైసీపీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి  ప్రకటించారు.  సోమవారం, అనంతపురం జిల్లాలో వైసీపీ సమర శంఖారావం సభలో పాల్గొన్న జగన్ మాట్లాడుతూ..

Life Homepathy
treefurn AD

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం అనంతపురం జిల్లా వాసులు సర్వం కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదున్నరేళ్లలో అనంతపురం జిల్లాలో 1280 మంది వైసీపీ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ దొంగకేసులు పెట్టి వేధింపులకు పాల్పడిందని ఆరోపించారు. కాగా, పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతీ కార్యకర్తను తన కుటుంబ సభ్యుడిగా చూసుకుంటానని భరోసా ఇచ్చారు. ప్రజలు భాగోగులు తానే చూసుకుంటానని హామీ ఇచ్చారు. అవినీతి లేని స్వచ్ఛమైన పాలన పేదవాడికి అందించాలన్నదే తన లక్ష్యమని జగన్ చెప్పుకొచ్చారు.

త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని మూడు నెలల్లో అన్ని ఎన్నికలు పూర్తవుతాయన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతీ వైసీపీ కార్యకర్తపై ఉందన్నారు. రాక్షసులతో, మోసగాళ్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోందని జగన్ తెలిపారు.

మామాట: పార్టీకి కార్యకర్తలే కదా ప్రాణం.. వారికి రక్షణ ఎంతో అవసరం 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: