భూమా ఇక్కడ…. అఖిలను తాకాలంటే భూమా కుటుంబాన్ని తాకాలి : మౌనిక

Share Icons:

అమరావతి, ఏప్రిల్ 27 :

ఆళ్లగడ్డ కాదని రాజకీయ ఆగడాల గడ్డగా మారుతోంది. భూమా అఖిల ప్రియ, ఏవి సుబ్బా రెడ్డి వర్గాలు సై అంటే సై అంటూ కత్తులు నూరుతున్నాయి. అమరావతిలో ఒకవైపు సిఎం ఎదుట పంచాయితీ జరుగుతున్నా భూమా నాగి రెడ్డి చిన్న కుమార్తె ఏవి సుబ్బా రెడ్డిపై విరుచుకుపడ్డారు. తన అక్క భూమా అఖిల ప్రియను తాకాలంటే చాలా మంది తాకి ఆ తరువాత ముందుకు వెళ్ళాల్సి ఉంటుందని హెచ్చరించారు.

చంద్రబాబు పిలుపు మేరకు ఆళ్లగడ్డ వర్గపోరు విషయమై మాట్లాడడానికి చంద్రబాబు నాయుడు గృహానికి విచ్చేశారు. ఈ సందర్భంగా వీ సుబ్బారెడ్డిని లక్ష్యంగా చేసుకుని వార్నింగ్ ఇచ్చారు. ఆ వార్నింగ్ ఆమె మాటల్లోనే… తమ తండ్రి భూమా నాగిరెడ్డి చనిపోయాక చిన్న పిల్లలమైన మేము ఎంతో సహనంతో ఉన్నామని చెప్పారు. తమకు ఏవీ సుబ్బారెడ్డి చిన్నప్పటి నుంచి తెలుసునని, ఆయన పిల్లలు, తాము కలిసే పెరిగామని చెప్పారు. తమ తండ్రి చనిపోయిన తరువాత ఏవీ సుబ్బారెడ్డి వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకున్నాడని ఆరోపించారు.

అఖిలప్రియ అంటే ఒట్టి అఖిలప్రియ కాదు.. భూమా అఖిలప్రియ

ఏవి సుబ్బా రెడ్డి రాజకీయంగా ఎదగాలనుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. భూమా అఖిలప్రియ, భూమా కుటుంబంపై వేలెత్తి చూపితే సహించేది లేదు, ఊరుకునేది లేదని హెచ్చరించింది. అఖిలప్రియ అంటే కేవలం అఖిలప్రియ కాదని, భూమా అఖిలప్రియ అనే విషయాన్ని ఏవీ మరిచిపోతున్నాడని అన్నారు. అక్క భూమా అఖిలప్రియ భూమా నాగిరెడ్డి కూతురు, ఎస్వీ సుబ్బారెడ్డి మనవరాలు, ఎస్వీ మోహన్‌రెడ్డి మేనకోడలు, నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి చెల్లెలు, అనే విషయాన్ని మరిచిపోకూడదని హెచ్చరించారు. అఖిలను టచ్‌ చేయాలంటే ముందుగా భూమా కుటుంబాన్ని టచ్‌ చేయాల్సి ఉంటుందని తీవ్ర స్వరంతో చెప్పారు.

ముఖ్యమంత్రి చంద్రబాబుని నమ్ముతున్నాం…

తమ తండ్రి భూమా నాగిరెడ్డి చనిపోయిన తరువాత తమ కుటుంబానికి అండగా ఉంటానని సీఎం చంద్రబాబు నాయుడు శాసనసభలో చెప్పారని, ఆయనపై తమకు నమ్మకం ఉందని అన్నారు. ఆయన న్యాయం చేస్తారనే నమ్ముతున్నామని అన్నారు. అయితే తన అక్కపైన, తమ కుటుంబంపైన వేలెత్తి చూపితే స్పందించక తప్పలేదని చెప్పారు. ప్రస్తుతం తాను ఏడు నెలల గర్బిణి అయినా సరే, కుటుంబాన్ని మీడియాలో, ప్రజల్లో చులకన చేసి మాట్లాడుతుంటే తట్టుకోలేక బయటికొచ్చి మాట్లాడుతున్నానని వివరించారు. ఓ వైపు ముఖ్యమంత్రితో సమావేశం ఉండగా, ఏవీ సుబ్బారెడ్డిని హెచ్చరిస్తూ నాగమౌనిక చేసిన వాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

మామాట : ఆళ్లగడ్డ చిచ్చు ఇప్పట్లో చల్లారుతుందా..?

English Summary :

Minister Akhila Priya sister and Ex MLA Bhuma Nagi Reddy younger daughter Naga Mounika warned AV Subba Reddy, don’t warned the Akhila Priya and Bhuma Family. She said that she is 7 months pregnant though she came because of unnessesary talks in media and public about her family,

Leave a Reply