యాత్రకి నేనే ముఖ్యమంత్రి పోటీనా…

Share Icons:

హైదరాబాద్, 6 ఫిబ్రవరి:

దివంగత మాజీ సీఎం వైయస్.రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర ఘట్టాన్ని ఆధారంగా చేసుకుని డైరెక్టర్ మహి వి రాఘవన్ తెరకెక్కించిన `యాత్ర`. సెన్సార్‌లో యూ సర్టిఫికేట్ పొంది… రెండు గంటల ఆరు నిమిషాల నిడివితో ఈ శుక్రవారం విడుదల కానుంది.  ఇక ఈ సినిమాలో పాద యాత్ర ఘట్టాలతో పాటు ప్రజల కష్టాల్ని చూపిస్తూ మంచి ఎమోషనల్ సీన్స్ చాలానే ఉన్నాయి. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి వైయస్సార్ పాత్రకి జీవం పోసారని ట్రైలర్‌లో చూస్తే అర్ధమవుతుంది. మొత్తానికి ఈ సినిమా వైఎస్ అభిమానులకి కనువిందే అని చెప్పొచ్చు.

ఇదిలా ఉంటే యాత్రతో పాటు రాజకీయ నేపథ్యంలో రూపొందిన నేనే ముఖ్యమంత్రి సినిమా కూడా విడుదల అవుతుంది. అయితే ఈ సినిమా వైయస్ జగన్‌పై సెటైర్ గా రూపొందించారని ప్రచారం జరుగుతోంది. ఇక ట్రైలర్ కూడా కొంచె అలాగే కనిపిస్తోంది.

దీంతో ఈ సినిమా యాత్రకి పోటీగా వదులుతున్నారని చర్చ జరుగుతోంది. కానీ వాస్తవానికి యాత్రకి ఉన్న క్రేజ్ ఈ సినిమాకి లేదు. అసలు ఈ సినిమా ఉందని చాలమందికి తెలియదు. గత రెండు రోజులు గానే ఈ సినిమా గురించి ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఈ సినిమా అంత క్లిక్ అయి యాత్రకి పోటీ ఇవ్వడం కష్టం.

ఒకవేళ సినిమా విడుదల తర్వాత బాగుందనే టాక్ వస్తే చూసే అవకాశాలు ఉన్నాయి. ఇక వైఎస్ వ్యతిరేక వర్గం కూడా ఈ సినిమా చూసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. . ఇక ఈ చిత్రంలో అన్నివర్గాలకు నచ్చే అంశాలతోపాటు అందర్నీ ఆలోచింపజేసేలా సన్నివేశాలు సంభాషణలు ఉంటాయని చెబుతున్నారు. సీనియర్ దర్శకుడు దేవీ ప్రసాద్ ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. మరి చూడాలి ఈ సినిమా యాత్రకి ఏ మాత్రం పోటీ ఇస్తుందో…

మామాట: యాత్రకి పోటీ ఇవ్వడం కష్టమే….

Leave a Reply