యాత్ర ఫస్ట్‌వీక్ కలెక్షన్.. ఇంకా ఎంత రావాలంటే..

Share Icons:

హైదరాబాద్, 16 ఫిబ్రవరి:

దివంగత మాజీ సీఎం వైఎస్సార్ పాదయాత్ర ఆధారంగా మలయాళ మెగా స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కినచిత్రం యాత్ర. ఈ నెల 8న విడుదలైన ఈ చిత్రానికి మొదటి వారం మంచి కలెక్షన్లనే రాబట్టింది. మహి వి రాఘవ దర్శకత్వం వహించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఇప్పటివరకు 7.7కోట్ల  షేర్‌ను సాధించింది.  

అయితే సినిమాను టోటల్ వరల్డ్ వైడ్ గా సుమారు 13.4 కోట్లకు అమ్మగా.. 13.5 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలో దిగింది. ఇక సినిమా మిగిలిన రన్‌లో మొత్తం మీద…7 కోట్ల లోపు షేర్‌ని అందుకోవాల్సి ఉంటుంది, ఇక 7 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకుంటే 15.8 కోట్ల దాకా ఉందని సమాచారం. ఇక సినిమాకి ఈ వారం పెద్దగా పోటీ ఇచ్చే సినిమాలు ఏమి లేవు. దీంతో ఈ వారం కూడా యాత్రకి కలిసొచ్చే అవకాశం ఉంది.

మామాట: మరి యాత్ర సేఫ్ జోన్‌లోకి వెళ్ళుద్దో లేదో చూడాలి..

Leave a Reply