TRENDING NOW

 సరికొత్త రికార్డు సృష్టించిన పాక్ లెగ్ స్పిన్నర్..

 సరికొత్త రికార్డు సృష్టించిన పాక్ లెగ్ స్పిన్నర్..

దుబాయ్, 6 డిసెంబర్:

పాకిస్థాన్ యువ లెగ్ స్నిన్న‌ర్ యాసిర్ షా.. టెస్టు క్రికెట్‌లో స‌రికొత్త రికార్డు సృష్టించాడు. అతి త‌క్కువ టెస్టు మ్యాచుల్లో 200 వికెట్లు తీసుకున్న బౌల‌ర్‌గా యాసిర్ రికార్డు నెల‌కొల్పాడు.

దుబాయ్‌లో న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న మూడ‌వ టెస్టులో ఈ ఘనత సాధించాడు. దాదాపు 82 ఏళ్ల రికార్డును అత‌ను బ్రేక్ చేశాడు. 1936లో ఆస్ట్రేలియా స్పిన్నర్ క్లారీ గ్రిమ్మెట్ 36 మ్యాచుల్లో 200 పడగొట్టాడు. ఇప్పటి వరకు ఇదే రికార్డు.

treefurn AD
Life Homepathy
GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,

న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న టెస్టు సిరీస్‌లో ఇప్ప‌టికే యాసిర్ 27 వికెట్లు తీసుకున్నాడు. ఈరోజు ఉద‌యం కివీస్ ప్లేయ‌ర్ సోమ‌ర్‌విల్లేను ఔట్ చేయ‌డంతో యాసిర్ ఈ రికార్డును చేజిక్కించుకున్నాడు. ఇక టెస్టుల్లో అతి త్వ‌ర‌గా 50 వికెట్లు తీసుకున్న బౌల‌ర్‌గా కూడా యాసిర్ పేరిట రికార్డు ఉన్న‌ది. 

మామాట: 82 ఏళ్ల రికార్డుని తిరగరాయడం గొప్ప విషయమే…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: