బీజేపీ నేతలపై ఫైర్ అయిన యనమల

AP Finance minister Yanamala ramakrishundu fires on PM MOdi
Share Icons:

అమరావతి, ఆగష్టు 28:

కేంద్రం నిధులతోనే రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తున్నట్లుగా బీజేపీ నేతలు సన్నాయి నొక్కులు నొక్కడం హాస్యాస్పదని, కేంద్రం సక్రమంగా సహకరిస్తే ఆంధ్రప్రదేశ్‌కు ఈ పరిస్థితి ఎందుకు వస్తుందని మంత్రి యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు.

ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ….కేంద్రం తోడ్పాటే ఉంటే నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని ప్రయత్నాలు ఎందుకు చేయాల్సివస్తుందని అన్నారు. బాండ్స్‌కు వెళ్లడం, రుణాలు తెచ్చుకోవడం ప్రయత్నాలన్నీ కేంద్రం సహకారం లేనందువల్లే స్వంతంగా నిధులను సమీకరించాల్సి వస్తోందని చెప్పారు.

ఇక ప్రజలకు సరైన సమాధానం చెప్పలేకే బీజేపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని,  షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 సంస్థల విభజన ఇంతవరకు ఒక కొలిక్కి తేకుండా ఏపిని అన్నిరకాలా కష్టాలలోకి నెట్టారని అన్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.40వేల కోట్లు కావాలని డిపిఆర్ ఇస్తే, కేవలం రూ.1500కోట్లు ఇచ్చి కేంద్రం చేతులు దులుపుకుందని మండిపడ్డారు.

ఇక చంద్రబాబు ప్రభుత్వం దుబారా చేస్తోందనడం మరో అబద్దపు ప్రచారమని, అసలు దుబారా జరిగితే కదా శ్వేతపత్రం విడుదల చేసేదనని అన్నారు.  వైఎస్సార్ కాంగ్రెస్ పద్ధతిలోనే బీజేపీ వ్యవహరిస్తోందని, అభివృద్దికి ఆటంకాలు కల్పించడం, అవినీతి ఆరోపణలు చేయడం ద్వారా రాష్ట్రాన్ని అప్రతిష్టపాలు చేయడమే ధ్యేయంగా బీజేపీ వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. వైసీపీ, బీజేపీ కుట్ర రాజకీయాలకు రాష్ట్ర ప్రజలు తిరుగులేని గుణపాఠం చెబుతారని అన్నారు.

మామాట: మరి ప్రజలు ఎవరికి గుణపాఠం చెబుతారో?

Leave a Reply