రెడ్ మీ సెన్సేషన్: తక్కువ ధరలో కొత్త ఫోన్…

Share Icons:

ముంబై: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్స్‌ తయారీదారు షియోమీ తన నూతన స్మార్ట్‌ఫోన్‌ రెడ్‌మీ 8ఎ డ్యుయల్‌ను భారత్‌లో తాజాగా విడుదల చేసింది. . ఈ ఫోన్‌కు చెందిన 2జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌ వేరియెంట్‌ ధర రూ.6499 ఉండగా, 3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌ వేరియెంట్‌ ధర రూ.6,999గా ఉంది. ఈ నెల 18వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను అమెజాన్‌ వెబ్‌సైట్‌తోపాటు ఎంఐ ఆన్‌లైన్‌ స్టోర్‌, ఎంఐ హోం స్టోర్‌లలో విక్రయించనున్నారు.

ఇందులో.. 6.22 ఇంచుల హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌, ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 439 ప్రాసెసర్‌, 3జీబీ ర్యామ్‌, ఆండ్రాయిడ్‌ 9.0 పై, 13, 2 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరాలు, 8 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరా, ఫేస్‌ అన్‌లాక్‌, డెడికేటెడ్‌ డ్యుయల్‌ సిమ్‌ స్లాట్స్‌, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 18 వాట్ల ఫాస్ట్‌ చార్జింగ్‌, యూఎస్‌బీ టైప్‌ సి.. తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

స్మార్ట్ వాచ్..

పోర్టబుల్‌ డిజిటల్‌ ప్రొడక్ట్స్‌ తయారీదారు ఇన్‌బేస్‌ రెండు నూతన స్మార్ట్‌వాచ్‌ల విడుదలతో భారత స్మార్ట్‌వాచ్‌ మార్కెట్‌లోకి కొత్తగా అడుగు పెట్టింది. ఇన్‌బేస్‌ అర్బన్‌ ఫిట్‌, అర్బన్‌ బీప్‌ పేరిట ఆ వాచ్‌లు విడుదల అయ్యాయి. వీటిలో జీపీఎస్‌, హార్ట్‌ రేట్‌ సెన్సార్స్‌, బ్లూటూత్‌ కనెక్టివిటీ, టచ్‌ స్క్రీన్‌ డిస్‌ప్లేలు తదితర ఫీచర్లను కామన్‌గా అందిస్తున్నారు. అలాగే వీటిలో 8 రకాల స్పోర్ట్స్‌ మోడ్స్‌, కాల్స్‌ అండ్‌ మెసేజ్‌ల నోటిఫికేషన్లు, ఐపీ 68 వాటర్‌, షాక్‌ రెసిస్టెన్స్‌, కెమెరా, మ్యూజిక్‌ కంట్రోల్స్‌.. తదితర ఇతర ఫీచర్లను కూడా అందిస్తున్నారు. కాగా అర్బన్‌ ఫిట్‌ వాచ్‌ ధర రూ.4,999 ఉండగా, అర్బన్‌ బీప్‌ వాచ్‌ ధర రూ.3,999గా ఉంది. వీటిని గోఅర్బన్‌.ఇన్‌ వెబ్‌సైట్‌తోపాటు రిటెయిల్‌ ఔట్‌లెట్లలోనూ వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.

పవర్ బ్యాంక్…

మొబైల్స్‌ తయారీదారు షియోమీ 10000, 20000 ఎంఏహెచ్‌ కెపాసిటీ కలిగిన రెండు నూతన ఫాస్ట్‌ చార్జింగ్‌ రెడ్‌మీ పవర్‌ బ్యాంక్‌లను భారత్‌లో విడుదల చేసింది. కాగా 10000 ఎంఏహెచ్‌ పవర్‌బ్యాంక్‌ ధర రూ.799 ఉండగా, 20000 ఎంఏహెచ్‌ పవర్‌ బ్యాంక్‌ ధర రూ.1499 గా ఉంది. వీటిని ఫిబ్రవరి 18వ తేదీ నుంచి ఎంఐ ఆన్‌లైన్‌ స్టోర్‌, ఎంఐ హోం స్టోర్‌లలో విక్రయించనున్నారు.
వీటికి 18 వాట్ల ఫాస్ట్‌ చార్జింగ్‌ ఫీచర్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఫోన్లను వేగంగా చార్జింగ్‌ చేసుకోవచ్చు. యూఎస్‌బీ టైప్‌ సి, మైక్రో యూఎస్‌బీ ఫోన్లను ఈ పవర్‌ బ్యాంక్‌లతో చార్జింగ్‌ చేసుకోవచ్చు. చార్జింగ్‌ స్టేటస్‌ కోసం వీటిపై ఎల్‌ఈడీ ఇండికేటర్లను కూడా ఏర్పాటు చేశారు. ఇక ఎంఐ బ్యాండ్‌, ఎంఐ బ్లూటూత్‌ ఇయర్‌ఫోన్స్‌ను కూడా ఈ పవర్‌ బ్యాంక్‌తో చార్జింగ్‌ చేసుకోవచ్చు.

Leave a Reply