తొలి పవర్‌ బ్యాంకు తయారీ యూనిట్‌ ప్రారంభించిన షియోమీ

Share Icons:

భారతదేశంలో షియోమి ఫోన్లు దూసుకుపోతూ, తక్కువ బడ్జెట్ తో ఎక్కువ ఫ్యూచర్స్ ని అందిస్తునాయి. స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో తనదైన స్థానాన్ని కైవసం చేసుకుంది, చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ షియోమి. ఇటీవల ప్రకటించిన ఐడిసి రిపోర్ట్‌లో శాంసంగ్‌తో కలిసి అగ్రస్థానంలో నిల్చుంది షియోమి. దీనితో ఆ సంస్థ భారత్‌లో మరిన్ని తయారీ కేంద్రాలు నెలకొల్పనున్నట్లు తెలిపింది. భారత ప్రభుత్వం చేపడుతున్న మేక్ ఇన్ ఇండియా  కార్యక్రమానికి తగ్గట్టుగా ఇక్కడే తయారు చేసి ముందుకు వెళతామని, ఆ కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌, షియోమి ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ మనుకుమార్‌ జైన్‌ తెలిపారు. నొయిడాలో షియోమి మూడో తయారీ యూనిట్‌ ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడారు. హైపాడ్‌ టెక్నాలజీ కంపెనీతో కలిపి ఇక్కడ పవర్‌ బ్యాంకులను అసెంబుల్‌ చేయనున్నారు. ఫోన్‌ కేటగిరీలో కాకుండా మిగిలిన ఉత్పత్తులకు సంబంధించి యూనిట్‌ను నెలకొల్పడం ఇదే మొదటిసారి అని, ఇందుకు చాలా సంతోషిస్తున్నామని జైన్‌ చెప్పారు.

ఈ సందర్భంగా రెండు పవర్‌ బ్యాంకులను విడుదల చేస్తున్నట్లు ఆ కంపెనీ తెలిపింది. ఒకటి 10,000 ఎంఎహెచ్‌ కెపాసిటి కలిగిన ఎంఐ పవర్‌ బ్యాంకు 2ఐ రూ.799 గాను,  రెండవది 20,000ఎంఎహెచ్‌ కెపాసిటీ కలిగిన ఎంఐ పవర్‌బ్యాంకు 2ఐ రూ.1,499గా ప్రకటన చేశారు. ఇక్కడ నిమిషానికి 7పవర్‌ బ్యాంకులు అసెంబుల్ చేస్తారు. ఇప్పటికే కంపెనీకి ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో రెండు తయారీ కేంద్రాలు ఉన్నాయి. దేశంలో లభ్యమయ్యే షియోమీ ఫోన్లలో 95శాతం ఇక్కడి నుంచే వస్తుంటాయి.

మామాట:  భారత వాణిిిజ్య కోటలో చైనా మోబైైల్ కంపెనీ పాగాా

Leave a Reply