TRENDING NOW

బడ్జెట్ ధరలో రెండు స్మార్ట్‌ టీవీలని విడుదల చేసిన షియోమీ…

బడ్జెట్ ధరలో రెండు స్మార్ట్‌ టీవీలని విడుదల చేసిన షియోమీ…
ఢిల్లీ, 10 జనవరి:

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ షియోమి భారత మార్కెట్లో బడ్జెట్ ధరలో రెండు స్మార్ట్‌ టీవీలని విడుదల చేసింది. ఎంఐ ఎల్ఈడీ టీవీ 4ఎ ప్రొ 43, ఎంఐ ఎల్ఈడీ టీవీ4ఎక్స్ ప్రొ 554కె పేరుతో ఈ టీవీలను విడుదల చేసింది. 43 ఇంచెస్ టీవీ ధర రూ.22,999గానూ, 55 అంచుల టీవీ ధర రూ.39,999గా కంపెనీ ప్రకటించింది.

ఫీచర్లు కూడా అదిరిపోయే రేంజ్‌లో ఉన్నాయి. ఈ నెల 15వ తేదీ నుంచి వీటి బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. 20 వాట్ల స్టీరియో స్పీక‌ర్లు, గూగుల్ వాయిస్ సెర్చ్, షియోమి సొంతమైన ప్యాచ్‌ వాల్‌ ప్రధాన ఫీచ‌ర్లుగా కంపెనీ పేర్కొంది.

Life Homepathy
treefurn AD

43 ఇంచ్ టీవీలో 1920 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్‌, వైఫై, హెచ్‌డీఎంఐ, యూఎస్‌బీ పోర్టులు త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. అలాగే 55 ఇంచ్ టీవీలో 3840 x 2160 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌, 2 జీబీ ర్యామ్‌, 8 జీబీ స్టోరేజ్‌, వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్ఈ, యూఎస్‌బీ, హెచ్‌డీఎంఐ పోర్టులు, డీటీఎస్ త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. 

మామాట: బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లు ఉన్నాయి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: