షియోమీ రెడ్ మీ 8 సిరీస్ లో మరో సరికొత్త ఫోన్…

xiaomi released redmi note 8 t smartphone
Share Icons:

ముంబై: ప్రముఖ చైనా మొబైల్స్ తయారీదారు షియోమీ మరో సరికొత్త ఫోన్ తో ముందుకొచ్చింది. గత కొంతకాలంగా రెడ్ మీ 8 సిరీస్ లో పలు ఫోన్లని విడుదల చేయనుంది.  ఇప్పటికే రెడ్‌మీ 8 ఏ, రెడ్‌మీ 8, రెడ్‌మీ నోట్ 8, రెడ్‌మీ నోట్ 8 ప్రో మోడల్స్‌ని తీసుకొచ్చింది. ఇప్పుడు అదే సిరీస్‌లో ఐదో స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 8టీ మోడల్‌ని ఆవిష్కరించింది. యూరప్‌లో జరిగిన ఈవెంట్‌లో ‘ఆల్-స్టార్’ పేరుతో రెడ్‌మీ నోట్ 8టీ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది.

3 జీబీ + 32 జీబీ, 4 జీబీ + 64 జీబీ, 4 జీబీ + 128 జీబీ వేరియంట్లలో ఈ ఫోన్ విడుదల చేసింది. స్నాప్‌డ్రాగన్ 665 ఏఐఈ చిప్‌సెట్, ఎన్ఎఫ్‌సీ సపోర్ట్, క్వాడ్ కెమెరా సెటప్, 18 W క్విక్ ఛార్జ్ 3.0 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఫ్రాన్స్‌లో నవంబర్ 13న సేల్ ప్రారంభం కానుంది. త్వరలో ఇండియాలో కూడా ఈ ఫోన్ విడుదల కానుంది. రెడ్‌మీ నోట్ 8టీ స్మార్ట్‌ఫోన్ 3 జీబీ + 32 జీబీ ధర సుమారు రూ.14,000 కాగా, 4 జీబీ + 64 జీబీ ధర సుమారు రూ.15,000. ఇక హైఎండ్ వేరియంట్ 4 జీబీ + 128 జీబీ ధర సుమారు రూ.19,000.

రెడ్‌మీ నోట్ 8టీ స్టార్‌స్కేప్ బ్లూ, మూన్‌లైట్ వైట్, మూన్‌షాడో గ్రే కలర్స్‌లో లభిస్తుంది. రెడ్‌మీ నోట్ 8టీ ఆండ్రాయిడ్ 9 పై + ఎంఐయూఐ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

రెడ్‌మీ నోట్ 8టీ ఫీచర్లు

డిస్‌ప్లే: 6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+

ర్యామ్: 3 జీబీ, 4 జీబీ

ఇంటర్నల్ స్టోరేజ్: 32 జీబీ, 64 జీబీ, 128 జీబీ

ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 665 ఏఐఈ చిప్‌సెట్

రియర్ కెమెరా: 48+8+2+2 మెగాపిక్సెల్ఫ్రంట్ కెమెరా: 13 మెగాపిక్సెల్

బ్యాటరీ: 4,000 ఎంఏహెచ్

ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 పై + ఎంఐయూఐ 10

స్ట్రీమింగ్ స్టిక్‌

ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్.. మార్‌క్యూ టర్బో స్ట్రీమ్ పేరిట ఓ నూతన స్ట్రీమింగ్ స్టిక్‌ను ఇవాళ భారత్‌లో విడుదల చేసింది. మార్‌క్యూ టర్బో స్ట్రీమ్ స్టిక్‌ను రూ.3499 ధరకు వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో కొనుగోలు చేయవచ్చు.

ఇందులో బిల్టిన్ క్రోమ్‌క్యాస్ట్‌ను ఏర్పాటు చేశారు. అందువల్ల దీంతో 1080పి రిజల్యూషన్ కలిగిన వీడియోలను కూడా స్ట్రీమింగ్‌లో వీక్షించవచ్చు. అలాగే వైఫైకు ఈ స్టిక్ కనెక్ట్ అవుతుంది. గూగుల్ క్రోమ్‌క్యాస్ట్, అమెజాన్ ఫైర్ స్టిక్‌ల తరహాలోనే ఈ స్టిక్ కూడా పనిచేస్తుంది. సాధారణ ఎల్‌ఈడీ లేదా ఎల్‌సీడీ టీవీలు ఉన్నవారు ఆ టీవీలకు హెచ్‌డీఎంఐ పోర్టులు ఉంటే ఈ స్టిక్‌ను సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చు.

ఇక ఇందులో 1జీబీ ర్యామ్, 8జీబీ స్టోరేజ్‌లను అందిస్తున్నారు. అలాగే డాల్బీ డిజిటల్ ఆడియోకు సపోర్ట్‌ను కూడా అందిస్తున్నారు. యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్‌ల కోసం రిమోట్‌పై ప్రత్యేకంగా బటన్లను కూడా ఏర్పాటు చేశారు.

 

Leave a Reply