48 మెగాపిక్సెల్ కెమెరాతో రెడ్‌మీ నోట్7…

Share Icons:

బీజింగ్, 11 జనవరి:

చైనాకి చెందిన మొబైల్స్ త‌యారీదారు షియోమీ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 7 ను తాజాగా చైనా మార్కెట్‌లో విడుద‌ల చేసింది. త్వరలోనే దీని భారత్ మార్కెట్లో విడుదల చేయనున్నారు.

ఈ ఫోన్‌కు చెందిన 3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.10,390 ఉండ‌గా, 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.12,460 ఉంది. అలాగే 6జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌రను రూ.14,540 గా నిర్ణ‌యించారు.

రెడ్‌మీ నోట్ 7 ఫీచ‌ర్లు… 
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే

2340 ×1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌

గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 660 ప్రాసెస‌ర్‌

3/4/6 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌

256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై

హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 48, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు

13 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌

ఐఆర్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ

బ్లూటూత్ 5.0, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, యూఎస్‌బీ టైప్ సి

4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, క్విక్ చార్జ్ 4.0.

మామాట: సూపర్ ఫీచర్లే ఉన్నాయి…

Leave a Reply