షియోమీ రెడ్‌మీ కె20 సిగ్నేచర్ ఎడిషన్‌ ఫోన్…ధర తెలిస్తే షాకే…..

Xiaomi Redmi K20 Pro Signature Edition is made of gold and costs whopping Rs 4.8 lakh
Share Icons:

ముంబై:

 

ఎప్పుడు తక్కువ ధరలో మంచి ఫీచర్లు లభించే స్మార్ట్ ఫోన్లు విడుదల చేసే షియోమీ సంస్థ….ఊహించని ధరలో ఓ ఫోన్ ని విడుదల చేసింది. షియోమీ ఇటీవల భారత మార్కెట్‌లో రెడ్‌మీ కె20, కె20 ప్రొ పేరిట రెండు నూతన స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా వీటిలో రెడ్‌మీ కె20 ప్రొ ఫోన్‌కు గాను సిగ్నేచర్ ఎడిషన్‌ను ఆ కంపెనీ విడుదల చేసింది.

 

అయితే ఈ వేరియెంట్ ధరను రూ.4.80 లక్షలుగా నిర్ణయించారు. దీన్ని బంగారంతో తయారు చేయడం విశేషం. అలాగే ఈ ఫోన్‌పై వజ్రాలను పొందు పరిచారు. అందుకే దీనికి అంత ధరను నిర్ణయించారు. అయితే ఈ ఫోన్‌ను వచ్చే వారం నుంచి భారత మార్కెట్‌లో విక్రయిస్తారు. ఇక ఇందులో ఫీచర్లన్నీ రెడ్‌మీ కె20 ప్రొ స్మార్ట్‌ఫోన్‌లోనివే ఉంటాయి.

 

ఫీచర్లు…

 

6.39 ఇంచుల డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 48, 8, 13 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ పాపప్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్

Leave a Reply