ఓపెన్ సేల్‌లో రెడ్‌మీ 8ఎ… ఇండియాలో వివో నూతన ప్లాంట్.

Share Icons:

ముంబై: చైనా దిగ్గజ మొబైల్స్ తయారీదారు షియోమీ ఇటీవల రెడ్ మీ 8 ఎ స్మార్ట్ ఫోన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దసరా, దీపావళి సందర్భంగా ఈ ఫోన్ ఆన్ లైన్ లో లభించింది. ఇప్పుడు దీన్ని ఓపెన్ సేల్‌లోనూ అందుబాటులో ఉంచారు. ఈ క్రమంలో ఈ ఫోన్‌కు చెందిన అన్ని వేరియెంట్లను వినియోగదారులు ఎంఐ ఆన్‌లైన్ స్టోర్, ఎంఐ హోం స్టోర్, ఫ్లిప్‌కార్ట్ సైట్లలో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ రూ.6499 ప్రారంభ ధరకు లభించనుంది.

రెడ్‌మీ 8ఎ స్మార్ట్‌ఫోన్‌లో 6.22 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 439 ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 12, 8 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, ఫేస్ అన్‌లాక్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

వివో ప్లాంట్

చైనా మొబైల్స్ తయారీదారు వివో భారత్‌లో మరో నూతన ప్లాంట్‌ను ప్రారంభించినట్లు తెలిపింది. రూ.7500 కోట్ల భారీ పెట్టుబడితో ఫేజ్ 1 ప్రాజెక్టులో భాగంగా ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్లు వివో వెల్లడించింది. 2020 వరకు ఫేజ్ 2లో భాగంగా కంపెనీని మరింత విస్తరిస్తామని వివో తెలిపింది. కాగా నూతన ప్లాంట్‌ను గ్రేటర్ నోయిడాలోని డబ్ల్యూటీసీ టెక్ జోన్‌లో ఏర్పాటు చేయగా అందులో అదనంగా 8.4 మిలియన్ ఫోన్లను ఏటా ఉత్పత్తి చేయనున్నారు. దీంతో వివో భారత్‌లో ఉన్న తన ప్లాంట్ల ద్వారా ఏటా మొత్తం 33 మిలియన్ల యూనిట్లను ఉత్పత్తి చేయనుంది.

బ్లూటూత్ స్పీకర్‌

ఆడియో ఉత్పత్తుల తయారీదారు 1మోర్ భారత్‌లో నూతనంగా ఓ పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్‌ను లాంచ్ చేసింది. ఇందులో 3.3 ఇంచుల వూఫర్, 0.75 ఇంచుల ట్వీటర్‌ను అందిస్తున్నారు. అందువల్ల సౌండ్ క్వాలిటీ బాగుంటుంది. 30 వాట్ల సౌండ్ అవుట్‌పుట్‌ను ఈ స్పీకర్ ఇస్తుంది. బ్లూటూత్ 4.2 ద్వారా ఈ స్పీకర్‌ను ఇతర డివైస్‌లకు కనెక్ట్ చేసుకుని వాటి ద్వారా మ్యూజిక్ స్ట్రీమ్ చేసుకోవచ్చు. ఈ స్పీకర్‌లో ఉన్న 2600 ఎంఏహెచ్ బ్యాటరీ వల్ల 12 గంటలపాటు నాన్‌స్టాప్‌గా మ్యూజిక్ వినవచ్చు. దీనికి ఐపీఎక్స్4 వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను అందిస్తున్నారు. రూ.10,999 ధరకు ఈ స్పీకర్‌ను వినియోగదారులు 1మోర్ వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయవచ్చు. అయితే నవంబర్ 20వ తేదీ లోపు ప్రీ ఆర్డర్ చేస్తే కేవలం రూ.6499కే ఈ స్పీకర్‌ను పొందవచ్చు.

Leave a Reply