అదిరిపోయే ఫీచర్లతో ఎం‌ఐ 10, 10 ప్రొ…

Redmi K30 5G to Launch in December, Xiaomi CEO Lei Jun Confirms
Share Icons:

ముంబై: చైనాకు చెందిన దిగ్గజ మొబైల్స్‌ తయారీదారు షియోమీ తన నూతన ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్లు ఎంఐ 10, ఎంఐ 10 ప్రొలను తాజాగా చైనా మార్కెట్‌లో విడుదల చేసింది. ఎంఐ 10 స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభ ధర 572 డాలర్లు (దాదాపుగా రూ.40,920) ఉండగా, ఎంఐ ప్రొ ప్రారంభ ధర 716 డాలర్లు (దాదాపుగా రూ.51,150)గా ఉంది. వీటిని ఫిబ్రవరి 18వ తేదీ నుంచి చైనాలో విక్రయించనున్నారు. ఇక ఈ ఫోన్‌ త్వరలోనే భారత మార్కెట్‌లోనూ లభ్యం కానుంది.

వీటిలో 6.67 ఇంచుల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ కర్వ్‌డ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేలను ఏర్పాటు చేశారు. వీటికి 90 హెడ్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌ ఫీచర్‌ను అందిస్తున్నారు. స్నాప్‌డ్రాగన్‌ 865 ప్రాసెసర్‌, లిక్విడ్‌ కూలింగ్‌, 12జీబీ వరకు ర్యామ్‌, ఎన్‌ఎఫ్‌సీ, తదితర ఇతర ఫీచర్లను ఈ ఫోన్లలో అందిస్తున్నారు. ఈ ఫోన్లలో 108 మెగాపిక్సల్‌ భారీ కెపాసిటీ కలిగిన కెమెరా వెనుక భాగంలో ఉంది. అలాగే 12 మెగాపిక్సల్‌ టెలిఫొటో కెమెరా, 2ఎక్స్‌ ఆప్టికల్‌ జూమ్‌, మరో 8 మెగాపిక్సల్‌ టెలిఫొటో కెమెరా, 20 మెగాపిక్సల్‌ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరాలను ఈ ఫోన్లలో అందిస్తున్నారు.

షియోమీ ఎంఐ 10, ఎంఐ 10 ప్రొ ఫీచర్లు…

6.67 ఇంచుల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే

2340 x 1080 పిక్సల్స్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌, గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌

ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 865 ప్రాసెసర్‌, 8/12 జీబీ ర్యామ్‌

128/256/512 జీబీ స్టోరేజ్‌, డ్యుయల్‌ సిమ్‌, ఆండ్రాయిడ్‌ 10

108, 12, 8, 20 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరాలు, 20 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరా

ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, యూఎస్‌బీ టైప్‌ సి

5జి, డ్యుయల్‌ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్‌ 5.1, ఎన్‌ఎఫ్‌సీ

4780/4500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఫాస్ట్‌ చార్జింగ్‌, వైర్‌లెస్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌

 

Leave a Reply