అతి తక్కువ ధరకే 20,000 ఎంఏహెచ్ ఎంఐ పవర్ బ్యాంక్

Xiaomi Mi Power Bank 2i Launched in India With 10,000mAh/20,000mAh
Share Icons:

ముంబై:

 

చైనాకి చెందిన మొబైల్స్ తయారీదారు షియోమీ తన ఎంఐ పవర్ బ్యాంక్ 2ఐ ని భారత మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. 20,000 ఎంఏహెచ్ కెపాసిటీ గల ఈ పవర్ బ్యాంక్ ధర రూ. 1499 లభ్యం కానుంది.  కాగా బ్లాక్ కలర్ ఆప్షన్‌లో ఇది వినియోగదారులకు లభిస్తున్నది. రూ.1499 ధరకు ఈ పవర్ బ్యాంక్‌ను వినియోగదారులు ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌లో కొనుగోలు చేయవచ్చు.

 

దీంట్లో 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఈ పవర్‌బ్యాంక్‌తో ఫోన్లను వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు. కాగా ఈ పవర్‌బ్యాంక్‌ను 18 వాట్ల చార్జర్‌తో చార్జింగ్ పెడితే పూర్తి చార్జింగ్ అయ్యేందుకు సుమారుగా 6.7 గంటల సమయం పడుతుంది. అదే 10 వాట్ల చార్జర్‌తో అయితే 10 గంటల వ్యవధిలో ఫుల్ చార్జింగ్ అవుతుంది.

 

ఇక షియోమీకి చెందిన సబ్‌బ్రాండ్ హువామీ నూతన స్మార్ట్‌వాచ్ అమేజ్‌ఫిట్ వెర్జ్ లైట్‌ను విడుదల చేసింది. డోర్ రన్నింగ్, ట్రెడ్‌మిల్, వాకింగ్, ఔట్‌డోర్ సైక్లింగ్, ఇండోర్ సైక్లింగ్, ఎలిప్టికల్ ట్రెయినర్ తదితర మోడ్స్ లభిస్తున్నాయి. ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను ఈ వాచ్‌లో ఇచ్చారు. అలాగే హార్ట్ రేట్ మానిటర్, 20 రోజుల బ్యాటరీ బ్యాకప్, ఎయిర్ ప్రెషర్ సెన్సార్, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ తదితర ఇతర ఫీచర్లను కూడా ఈ వాచ్‌లో అందిస్తున్నారు. ఇందులో 1.3 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. రూ.6,999 ధరకు ఈ వాచ్‌ను వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో కొనుగోలు చేయవచ్చు.

Leave a Reply