అదిరిపోయే ఫీచర్లతో షియోమీ ఎం‌ఐ ఎ3 విడుదల…

xiaomi mi a3 released in india
Share Icons:

ముంబై:

 

చైనాకి చెందిన దిగ్గజ మొబైల్స్ తయారీదారు షియోమీ తన నూతన ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్ ఎంఐ ఎ3ని తాజాగా భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్‌లో ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేయగా.. గతంలో ఈ ఫీచర్‌తో వచ్చిన ఫోన్ల కన్నా ఈ ఫోన్‌లో ఫింగర్‌ప్రింట్ స్కానర్ డిటెక్షన్ ఏరియా 15 శాతం ఎక్కువగా ఉంటుంది.

 

షియోమీ ఎంఐ ఎ3 స్మార్ట్‌ఫోన్ బ్లూ, వైట్, గ్రే కలర్ ఆప్షన్లలో విడుదల కాగా ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.12,999గా ఉంది. అలాగే 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.15,999 గా ఉంది. ఈ ఫోన్‌ను అమెజాన్, ఎంఐ ఆన్‌లైన్ స్టోర్, ఎంఐ హోం స్టోర్‌లలో ఈ నెల 23వ తేదీ నుంచి విక్రయించనున్నారు. లాంచింగ్ సందర్భంగా ఈ ఫోన్‌పై పలు ఆఫర్లను కూడా అందిస్తున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డులతో ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ.750 క్యాష్ బ్యాక్ ఇస్తారు.

 

షియోమీ ఎంఐ ఎ3 ఫీచర్లు…

 

* 6.08 ఇంచెస్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్

* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్

* హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై

* 48, 8, 2 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు

* 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్

* డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి

* 4030 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, ఫాస్ట్ చార్జింగ్

Leave a Reply