ఆకట్టుకుంటున్న షియోమీ కొత్త ఇ-బైక్

Share Icons:

ఢిల్లీ, 25 ఏప్రిల్:

చైనాకు చెందిన దిగ్గజ ఎలక్ట్రానిక్స్ కంపెనీ షియోమీ తాజాగా సరికొత్త ఎలక్ట్రిక్ బైసైకిల్‌‌ను మార్కెట్‌లో విడుదల చేసింది.  దీని పేరు హిమో టీ1. ఇందులో 90ఎంఎం వెడల్పైన టైర్లు, వన్ బటన్ స్టార్ట్, మల్టీ కాంబినేషన్ స్విచ్, డిజిటల్ డిస్‌ప్లే వంటి ప్రత్యేకతలున్నాయి.

ఈ బైక్ ధర దాదాపు రూ.30,700గా ఉంది. చైనా మార్కెట్‌లో వీటి అమ్మకాలు జూన్ 4 నుంచి ప్రారంభమయ్యే అకాశముంది. దీని బరువు 53 కేజీలు. రెడ్, గ్రే, వైట్ రంగుల్లో ఇది అందుబాటులో ఉండనుంది.

ఇక  హిమో టీ1లో లిథియమ్ అయాన్ బ్యాటరీ ఉంటుంది. దీని కెపాసిటీ 14,000 ఎంఏహెచ్. వోల్టేజ్ 48వీ. 14ఏహెచ్, 28ఏహెచ్ ఎనర్జీ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. 14ఏహెచ్ ఆప్షన్‌తో ఈ ఎలక్ట్రిక్ బైసైకిల్ 60 కిలోమీటర్లు వెళ్తుంది. అదే 28 ఏహెచ్ ఆప్షన్‌తో అయితే 120 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.

మామాట: సరికొత్త ఫీచర్లు ఉన్నాయిగా….

Leave a Reply