స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో శాంసంగ్‌కు షాక్…భారత్‌లో టాప్-2 ప్లేస్‌లో ఉన్నవి ఇవే…

Samsung Galaxy A20s With Triple Rear Cameras, Snapdragon 450 SoC Launched in India
Share Icons:

ముంబై: ఒకప్పుడు భారత్ మొబైల్స్ మార్కెట్లో శాంసంగ్‌ నెంబర్-1 పొజిషన్‌లో కొనసాగుతూ వచ్చేది. కానీ ఒక్కసారిగా చైనా మొబైల్స్ తయారీదారు షియోమీ తక్కువ ధరలో మంచి ఫీచర్లు అందించే మొబైల్స్ అందించడంతో శాంసంగ్‌ వెనక్కి వెళ్లిపోయింది. ఇక ఇప్పుడు వివో కూడా స్మార్ట్‌ఫోన్ రంగంలోకి దూసుకురావడంతో శాంసంగ్‌కు భారీ షాక్ తగిలింది.

కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చి సంస్థ వెల్లడించిన నివేదిక ప్రకారం… 2019వ సంవత్సరం నాలుగవ త్రైమాసికంలో భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో 27 శాతం మార్కెట్‌ షేర్‌తో షియోమీ మొదటి స్థానంలో నిలవగా, వివో 21 శాతం వాటాతో శాంసంగ్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానంలో నిలిచింది. ఇక శాంసంగ్‌ 19 శాతం వాటాతో 3వ స్థానానికి పడిపోయింది. అలాగే 12, 8 శాతం మార్కెట్‌ షేర్‌తో ఒప్పో, రియల్‌మిలు 4, 5వ స్థానాల్లో నిలిచాయి. కాగా కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చి చెబుతున్న ప్రకారం గడిచిన నాలుగేళ్ల కాలంలో వివో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్లను ప్రవేశపెట్టడంలో ఇతర మొబైల్‌ తయారీ కంపెనీల కన్నా ముందుందని వెల్లడైంది.

ఇదిలా ఉంటే షియోమీ మూడు స్మార్ట్‌ఫోన్ల ధరలని తగ్గించింది. అందులో ఎం‌ఐ ఏ3  ఫోన్ రిలీజ్ అయినప్పుడు 4జీబీ+64జీబీ ధర రూ.12,999 కాగా, 6జీబీ+128జీబీ ధర రూ.15,999. కొంతకాలం తర్వాత రూ.500 తగ్గించింది. ఇప్పుడు మరోసారి ధర తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం 4జీబీ+64జీబీ ధర రూ.11,999 కాగా, 6జీబీ+128జీబీ ధర రూ.14,999.

రెడ్‌మీ కే20 ప్రో స్మార్ట్‌ఫోన్‌తో పాటు రెడ్‌మీ కే20 రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. షియోమీ రెడ్‌మీ కే20 ధర కూడా తగ్గించింది. రెడ్‌మీ కే20 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.22,999 నుంచి రూ.19,999 ధరకు తగ్గింది. ఇక రిలీజ్ సమయంలో రెడ్‌మీ గో ధర కాగా రూ.4,499 ప్రస్తుత ధర రూ.4,299 మాత్రమే. ఆండ్రాయిడ్ గో ఆపరేటింగ్ సిస్టమ్‌తో షావోమీ రిలీజ్ చేసిన ఫోన్ ఇది. ఫేస్‌బుక్, వాట్సప్, టిక్‌టాక్, యూట్యూబ్‌ లాంటి యాప్స్ అన్నీ లైట్‌వెయిట్ వర్షన్‌లో లభిస్తాయి.

 

Leave a Reply