నేడు ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం(వీడియో)

Share Icons:

తిరుపతి, నవంబర్ 19,

ఇటువంటిది కూడా ఉంటుందా, అంటే ఉంది. అదే మానవ ప్రగతికి పెద్ద ప్రశ్నగా మిగిలింది. ప్రపంచంలో మిలియన్ల మందికి రోజువారి కాలకృత్యాలు తీర్చుకోవడం పెద్ద సవాలు. ముఖ్యంగా మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న ఇబ్బంది చెప్పనలవి కానిది. కనీసం పాఠశాలలో కూడా బాలికలకు సరైన మరుగుదొడ్లు లేవంటే మన నాగరికత, అభివృద్ది తగలేయడానికా? ఎందుకు? కొందరికే అభివృద్ధిఫలాలు అందుతున్నాయి ఎందుకో?  తక్కినవారికి కనీస అవసరాలు కూడా తీరడం లేదు. వారు మనుషులు కారా.?  వారికి ఆత్మాభిమానం ఉండదా.? పాలకులు తమ తీరు మార్చుకోవాలంటే.. పాలితుల ఆలోచనాధోరణిలో మార్పు రావాలి. స్తబ్దుగా ఉండిపోకుండా, రాజ్యం కొందరికే భోజ్యం కాదు. ప్రజలందరికీ మొదట మౌళిక వసతులు కల్పించి, ఆ తరువాత సుఖాల కల్పనకు వెళ్లాలని బడుగుజీవులు పిడికిలి బిగించాలి. అంతవరకు పాలకుల్లో మార్పు రాదు.

అంతే కాదు మౌళికంగా ప్రజలుకూడా పరిశుభ్రతపై కాస్త శ్రద్ధపెట్టాలి. నివాసాల చుట్టుపక్కల శుద్దంగా ఉండేలా చూసుకోవాలి. ఇంట్లో చెత్త ఊడ్చి రోడ్డుపై పోయడం వంటివి చేయకూడదు. తప్పనిసరిగా పిల్లలకు కూడా మరుగుదొడ్డివాడ్డం అలవాటు చేయాలి అపుడే, డయేరియా, కలరా తదితర జబ్బల బారిన పడకుండా ఉంటారు.

మామాట:  మరుగుదొడ్డి కేవలం మరుగు కోసమే కాదు ప్రజారోజ్యంకూడా దాగి ఉంది.

Leave a Reply