మ్యాచ్ ఫలితం చెప్పే చెవిటి పిల్లి గురించి మీకు తెలుసా?

World Cup opener, 'psychic' cat predicts winner fur real
Share Icons:

మాస్కో, 15 జూన్:

2010 ఫుట్‌బాల్ ప్రపంచకప్ సందర్భంగా ప్రతి మ్యాచ్‌కు ముందు ఫలితాల్ని అంచనా వేసిన ఆక్టోపస్ పాల్ గుర్తుంది కదా. ఇప్పుడు మరో జంతువు ఫిఫా ప్రపంచకప్ ముంగిట ఫలితాల్ని అంచనా వేయడానికి సిద్దమైంది. అదీ కూడా ఒక చెవిటి పిల్లి. దాని పేరు అచిల్లీస్. రష్యాకు చెందిన ఈ తెల్ల పిల్లి తమ దేశం ఆతిథ్యమిస్తున్న ఫుట్‌బాల్ ప్రపంచకప్ మ్యాచ్‌ల ఫలితాల్ని అంచనా వేయడానికి ప్రత్యేక శిక్షణ తీసుకుంది.

2017 కాన్ఫిడరేషన్ కప్‌లో ఈ పిల్లి చెప్పినట్లుగానే ఫలితాలు రావడంతో అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. సెయింట్ బర్గ్‌లోని మ్యూజియంలో ఉండే ఈ తెల్లపిల్లి అంచనాలు వేయడంలో దిట్టగా పేరు పొందింది. ఆహారం నింపిన రెండు వేర్వేరు పాత్రల్లో మ్యాచ్‌లో తలపడనున్న జట్ల జాతీయ పతాకాలను విడివిడిగా పెడతారు.

Russia cat

ఈ పిల్లి ఏదో ఒక పాత్రలోని ఆహారాన్ని తీసుకుంటుంది. ఆ పాత్రలో ఉన్న జాతీయ పతాకం గల జట్టు విజేతగా నిలుస్తుందన్న అంచనాకు వస్తారు. అయితే ఇది చెవిటి పిల్లి కావడం వల్ల అది ఫలితాల్ని అంచనా వేస్తున్నపుడు దాన్ని మాటలతో ఎవరూ ప్రభావితం చేయలేరు.

కాగా, గురువారం ప్రపంచకప్ ఆరంభ పోరుకు సంబంధించి కూడా ఈ పిల్లి సౌదీ అరేబియాతో తలపడనున్న ఆతిథ్య రష్యానే గెలుస్తుందని చెప్పింది. అయితే ఈ పిల్లి చెప్పిందే చివరికి నిజం అయ్యింది. ఆ ప్రకారమే నిన్న రాత్రి జరిగిన మ్యాచ్‌లో సౌదీ అరేబియాపై ఆతిథ్య రష్యా జట్టు 5-0 తేడాతో విజయం సాధించింది.

pig predictor

మార్కస్‌ అనే పంది

ఇక ఈ పిల్లితో పాటు జోస్యం చెప్పేందుకు మార్కస్ అనే ఓ పంది కూడా ముందుకొచ్చింది. ఫలితాలు ఊహించడంలో మార్కస్‌ది 100 శాతం రికార్డు అని దాని బ్రిటిష్‌ యజమాని చెబుతున్నాడు. నైజీరియా, బెల్జియం, ఉరుగ్వే, అర్జెంటీనా సెమీఫైనల్‌ వెళ్తాయని ఇప్పటికే ఈ పంది జోస్యం చెప్పింది. ఆయా దేశాల జెండాలు గుచ్చి ఉన్న యాపిల్‌లను తినడం ద్వారా ఇది ఫలితాలను అంచనా వేస్తుంది.

మామాట: భలే జంతువులు…!

Leave a Reply