రేపే ఇండియా-పాక్‌ల పోరు: మ్యాచ్‌కు వరుణ గండం…

Share Icons:

 

మాంచెస్టర్, 15 జూన్:

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హై వోల్టేజ్ గేమ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. రేపు మాంచెస్టర్ వేదికగా ప్రపంచ కప్ లో ఇండియా-పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. గెలుపు కోసం ఇరు జట్లు గట్టిగా పోరాడనున్నాయి.

అయితే వరల్డ్‌క్‌పను వెంటాడుతున్న వరుణుడు భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య మాంచెస్టర్‌లో జరిగే మ్యాచ్‌నీ వదిలేలాలేడు. మ్యాచ్‌రోజైన ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటలవరకూ వర్షం కురిసే అవకాశముందన్నది వాతావరణ శాఖ అంచనా.

అయితే ఉదయం 10లోపు, సాయంత్రం 6 తర్వాత వర్ష సూచనలేదు. ఇక శనివారం కూడా దాదాపు అదే పరిస్థితి. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 దాకా వర్ష సూచన ఉన్నదట. అలాగే శనివారం ఆస్ర్టేలియా-శ్రీలంక, అఫ్ఘానిస్థాన్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే రెండు మ్యాచ్‌లనూ వరుణుడు అడ్డుపడటం ఖాయమన్నది వాతావరణ శాఖ అంచనా.

ఇదిలా ఉంటే విరాట్ బ్యాటింగ్ స్ట‌యిల్‌ను.. పాక్ ప్లేయ‌ర్ బాబ‌ర్ ఆజ‌మ్ నేర్చుకుంటున్నాడు. కోహ్లీ వీడియోలు చూస్తూ.. పాక్ బ్యాట్స్‌మెన్ బాబ‌ర్ ఆదివారం పోరుకు సిద్ధ‌మ‌వుతున్నాడు. టీమిండియా కెప్టెన్‌ వీడియోలు చూసి చాలా నేర్చుకున్న‌ట్లు బాబ‌రే స్వ‌యంగా ఈ విష‌యాన్ని చెప్పాడు.

కోహ్లీ క్రికెట్ నైపుణ్యం త‌న‌కు న‌చ్చిన‌ట్లు బాబ‌ర్ వెల్ల‌డించాడు. అయితే మ‌రింత ప‌టిష్టంగా త‌యార‌య్యేందుకు కోహ్లీ వీడియోల‌ను చూస్తున్న‌ట్లు చెప్పాడు. విరాట్ త‌ర‌హాలో మ్యాచ్ విన్న‌ర్ కావాల‌న్న ఉద్దేశాన్ని బాబ‌ర్ వ్య‌క్తం చేశాడు. ఇటీవ‌ల చాంపియ‌న్స్ ట్రోఫీ గెలిచిన త‌ర్వాత పాక్ మ‌నోధైర్యం పెరిగింద‌ని బాబ‌ర్ అన్నాడు.

 

Leave a Reply