ప్రపంచ కప్‌కు టీమిండియా -పంత్‌కు దక్కని చోటు

World cup 2019- Team India
Share Icons:

ముంబై,ఏప్రిల్ 15,

ప్రపంచ కప్‌కు ఆడబోయే టీమిండియా జట్టును సెలక్షన్ కమిటీ ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టను సోమవారం ప్రకటించారు. విరాట్ కొహ్లీ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రోహిత్ శర్మకు వైస్ కెప్టన్ బాధ్యతలు అప్పగించారు. వీరితో పాటు ఎంస్ ధోనీ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, విజయ్ శంకర్, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్, బుమ్రా, హార్దిక్ పాండ్యా, జడేజా, మహ్మద్ షమీకి జట్టులో చోటు కల్పించారు.

ఇక ఐపీఎల్‌లో అదరగొడుతున్న రిషబ్ పంత్‌కు స్థానం దక్కలేదు. అంబటి రాయుడు, రవిచంద్రన్ అశ్విన్‌కు సైతం సెలెక్టర్లు షాకిచ్చారు. రిజర్వ్‌డ్ కీపర్‌గా దినేశ్ కార్తీక్‌కు జట్టులో స్థానం కల్పించారు.

మామాట: శుభమస్తు, కప్పుతో తిరిగి రండహో

Leave a Reply